కేక్ అంటే చాలా మందికి ఇష్టం.ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా మంది ఏ శుభకార్యం జరిగినా కూడా కేక్ ను కట్ చేయించడం చేస్తున్నారు.
రాను రాను కేక్ అనేది గుడ్ న్యూస్ జరిగితే ప్రత్యక్షమయ్యే తీరుతో ముందుకు సాగుతోంది.ఇలాంటి తరుణంలో ఓ కేక్ లక్షలు పలికింది.
సాధారణంగా కేక్ ధర చాలా తక్కువగానే ఉంటుంది.కానీ ఇక్కడ మాత్రం లక్షలు అయ్యింది.
అటేంది అని ఆశ్చర్యపోతున్నారు.ఆ కేక్ వెనకాల ఉన్న చరిత్రేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా పెళ్లి సమయంలోని కేక్ ను ఇప్పుడు వేలం వేశారు.ఆ కేక్ 1,850 పౌండ్లకు అంటే రూ.1,90,324లకు వేలం వేశారు.40 సంవత్సరాలకు ముందునాటి ఆ కేక్ పీస్ కు ఇప్పుడు వేలం పాట నిర్వహిస్తే దానిని కొనుగోలు చేయడానికి చాలా మంది క్యూలో నిలబడ్డారు.ఆఖరికి ఆ కేకు రూ.1.9 లక్షలకు కొనుగోలు చేయబడింది.అంత ధరకు అమ్ముడైన కేక్ గా అది రికార్డ్ కెక్కింది.
కేక్ పీస్ బ్రిటిష్ కాలంలో ఒక రాజ దంపతుల పెళ్లిలో వాడారు.ఆ సమయంలో చేసిన 23 కేకులలో ఈ కేక్ కూడా ఒక రకానికి చెందినదని చెప్పొచ్చు.

ఆ రోజుల్లో సుమారుగా 1981వ సంవత్సరంలో జూలై నెల 29వ తేదీన రాజ దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు.ఆ సమయంలో చార్లెస్, డయానాలు ఇద్దరూ కలిసి 23 రకాలైన కేకులను కట్ చేసి అందరికీ పెట్టారు.ఆ టైంలో మిగిలిన ఓ ముక్కకే ఇప్పుడు వేలంపాట నిర్వహించారు.ఆ సమయంలో ఆ కేకు ముక్కను మోయా స్మిత్‌కు అందజేస్తే ఆమె కుటుంబీకులు 2008వ సంవత్సరంలో ఓ కలెక్టర్‌కు ఆ కేకును అమ్మేశారు.
ఆ తర్వాత అది మొన్న బుధవారం వేలం పాటకొస్తే గ్యారీ లేటన్ అనే ఆయన ఆ కేక్ ను 2,565 డాలర్లకు కొనుగోలు చేశాడు.