జగన్ పాలన బాగున్నా .. ఇవి మాత్రం ఇబ్బందేనట..!

గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పనితీరు కాస్తో కూస్తో బెటర్ గా ఉంది అనేది అందరి అభిప్రాయం.దానికి తగ్గట్లుగానే ఏపీలో సంక్షేమ పథకాలతో జగన్ పరిపాలన దూసుకెళ్తున్నారు.

 Cag Report On Jagan Administration, Cag Report,ys Jagan, Ycp Govt, Jagan Adminis-TeluguStop.com

ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరే విధంగా జగన్ చేయడంలో సక్సెస్ అయ్యారు.ప్రజలలోనూ ఆ సంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక వైసీపీ నాయకులు ఈ వ్యవహారాలపై గొప్పగానే చెప్పుకుంటూ, కాలర్ ఎగురవేసుకుంటున్నారు.వైసిపి నాయకులు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నా, తమ ప్రభుత్వ పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు.

దీనికి తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు సరికొత్త ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వం క్రెడిట్ తగ్గిపోకుండా చూసుకుంటూ వస్తున్నారు.ఇక ప్రతిపక్షాలు జగన్ పరిపాలనపై నిత్యం విమర్శలు చేస్తూ వస్తున్నా, పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు.


ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థ కాగ్ తన నివేదికలో జగన్ పరిపాలన గురించి సమగ్రంగా వివరించింది.వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఆదాయం, సంక్షేమ పథకాలు, వడ్డీలు, మార్కెట్ రుణాలు ఇలా అన్ని అంశాలపైనా రిపోర్ట్ ను అందించింది.

దీనిలో ఒక పక్క జగన్ పరిపాలన మెచ్చుకుంటూనే, మరోపక్క సంక్షేమ పథకాల పేరుతో ఇతర అంశాలకు ఖర్చు పెట్టాల్సిన నిధులను సైతం డైవర్ట్ చేస్తున్నారనే విషయాన్ని తప్పుబట్టింది.భారీ ఎత్తున ఉచిత పథకాల కోసం నిధులను ఖర్చు పెడుతూ, మిగతా అంశాలను పట్టించుకోవడం లేదని, రానున్న రోజుల్లో ఇది రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించే అంశమని తమ నివేదికలో పేర్కొంది.

Telugu Cag, Cag Jagan, Central, Jagan, Scheems, Welfare, Ycp, Ys Jagan, Ysrcp-Te

ప్రభుత్వ నిధులు దుబారా కాకుండా పొదుపు చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం బాగానే పని చేస్తున్నప్పటికీ, నిర్దిష్ట పనులకు ఖర్చు చేసే విషయంలో మాత్రం ముందుచూపుతో వ్యవహరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తప్పుబట్టింది.దీని ప్రభావం ఇతర అంశాల పైన పడుతుందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.అలాగే కేంద్రం నుంచి వస్తున్న నిధులను ఇతర అంశాలకు ఖర్చు పెట్టకుండా, వాటిని కూడా మళ్ళించి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్న తీరుపైనా ఆక్షేపించింది.మొత్తంగా చూస్తే జగన్ పరిపాలనపైనా, రాష్ట్ర సంక్షేమ పథకాల కు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ , మిగతా అంశాలను పక్కన పెట్టేస్తున్నారు అనే విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.

మరి జగన్ ఇప్పటికైనా కాగ్ చేసిన ,ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube