రాఫెల్ ఒప్పందంపై కేంద్రానికి క్లీన్ చీట్ ఇచ్చిన కాగ్!

ఇండియన్ ఆర్మీకి రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయిలు చేతులు మారాయని కేంద్ర ప్రభుత్వంపైని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ కుంభ కోణంలో నిజానిజాలు బయట పెట్టాలని, రాహుల్ టీం భారీ ఎత్తున ఆందోళన చేసింది.

 Cag Gives Clean Chit To Bjp Government On Rafale Deal-TeluguStop.com

ఇక పార్లమెంట్ సమావేశాలలో కూడా కూడా రాఫెల్ స్కాం చుట్టూనే విపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేసింది.ప్రధాని నరేంద్ర మోడీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ని ఈ రాఫెల్ స్కాంలో ముద్దాయిలు చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర విపక్షాలు కూడా చేసాయి.

ఈ నేపధ్యంలో ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా కాగ్ ని ఆదేశించింది.

తాజాగా చివరి పార్లమెంట్ సమావేశాలలో, కాగ్ తన నివేదికని సిద్ధం చేసి పార్లమెంట్ ముందు ఉంచింది.

ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టె విధంగా కాగ్ తన నివేదిక సమర్పించింది.రాఫెల్ డీల్ లో కేంద్రం ఎలాంటి కుంభకోణంకి పాల్పడలేదని కాగ్ కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చింది.

ఇక రాఫెల్ ఒప్పందం గతంలో కంటే తక్కువ ధరలకే కుదిరినట్లు స్పష్టం చేసిన కాగ్, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, చాలా క్లియర్ గా ప్రభుత్వ నిర్దేశకాలు లోబడే బీజేపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని స్పష్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చింది.అయితే కాగ్ నివేదిక అంతా తప్పుల తడక అని, ప్రభుత్వం కావాలనే తమకి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకొని క్లీన్ చీట్ సంపాదించుకుంది అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube