విషాదంగా ముగిసిన కాఫీ డే సిద్దార్ధ్ కథ! నేత్రావతిలో మృతదేహం

ఎంతటి పెద్ద వ్యాపారవేత్తలకి అయిన నష్టాలతో వచ్చే ఒత్తిడి సహజం.అయితే ఒత్తిడిని కొంత మంది తట్టుకొని మళ్ళీ నష్టాల నుంచి బయటపడి ఎదిగే ప్రయత్నం చేస్తారు.

 Cafe Coffee Day Owner Founder Vg Siddhartha Found Dead Tstop-TeluguStop.com

అయితే కొందరు మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకోలేక సంస్థని అమ్మేయడమో, లేక ఆత్మహత్య చేసుకోవడమో చేస్తారు.ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాఫీ డే తో తనదైన బ్రాండ్ సొంతం చేసుకున్న కాఫీ డే షాప్స్ వ్యవస్థాపకుడు మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్దార్ద్ నష్టాలు భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండు రోజుల క్రితం చివరిగా కాఫీ డే బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి లేఖ రాసి అదృశ్యం అయిన సిద్దార్ద్ కర్ణాటకలో సంచలనంగా మారాడు.ఉన్నపళంగా అదృశ్యం అవడం, చివరిగా తాను ఈ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నా అని అందరికి క్షమించాలి అని చెబుతూ లేఖ రాయడం కలకలం రేపింది.

ఇదే సమయంలో అతను చివరిగా బెంగుళూరు శివారులో ఉన్న నేత్రావతి నది దగ్గరకి కారు నడుపుకుంటూ వచ్చి మాయం కావడంతో అతను అత్మహత్యాప్రయత్నం చేసాడేమో అనే అనుమానంతో నిన్నటి నుంచి నది లో గజ ఈతగాళ్ళ సాయంతో గాలిపు చర్యలు చేపట్టారు.నేత్రావతి నడిలో ఎవరో దూకడాన్ని చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించడంతో నదిలో ముమ్మర గాలింపు చేపట్టారు.36 గంటల గాలింపు తర్వాత ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది.స్థానిక జాలర్లు సిద్ధార్థ మృతదేహాన్ని గుర్తించి వెలుపలికి తీసుకొచ్చారు.

చివరికి ఇండియాలో ప్రముఖ గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారవేత్త కథ ఇలా ఆత్మహత్యతో ముగిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube