ఈ మధ్యకాలంలో డ్రింక్స్ మీద, చాక్లెట్ల మీద అనేక వివాదాస్పద ఘటనలు అనేవి చోటుచేసుకున్నాయి.కూల్ డ్రింక్ లో పాము ఉందని, తేలు కనిపించిందని, అలాగే చాక్లెట్లలో పురుగులు కనిపించాయని వార్తల్లో చర్చ సాగింది.
తాజాగా ఇటువంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది.క్యాడ్‌బరి చాక్లెట్ అనేది చాలా మందికి ఇష్టం.
ఈ క్యాడ్‌బరి చాక్లెట్ ను తినడం అంటే చాలా మందికి ప్రాణం కూడా.ఈ చాక్లెట్లను తినేవారు ఎక్కువ మందే ఉన్నారు.
మరి అలాంటి చాక్లెట్లలో బీఫ్ కలుపుతున్నారనే విషయం మీకు తెలిస్తే మీరు ఏం అంటారు.? ఈ చాక్లెట్లలో బీఫ్ కలుపుతున్నారనే వివాదం కొనసాగుతూ వస్తోంది.క్యాడ్‌బరిని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రోటీన్ తో తయారు చేస్తారనే వార్తలు షికారు చేశాయి.ఇండియాలో చూస్తే ఈ క్యాడ్‌బరి చాక్లెట్ ను బ్యాన్ చేయాల్సిందేనని అంటూ చాలా మంది డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా దానిపై పెద్ద యుద్దమే చేస్తున్నారు.

తాజాగా ఇప్పుడు బీఫ్ ను ఈ చాక్లెట్ లో కలుపుతున్నారంటూ క్యాడ్‌బరి చాక్లెట్ కంపెనీ దీనిపై వివరణ ఇచ్చింది.ఈ వివాదంపైన ఓ క్లారిటీని ఇచ్చింది.తప్పుడు సమాచారంతో ఇటువంటి పోస్టులను పెట్టడం నేరమని ఆ సంస్థ హెచ్చరించింది.
తమ కంపెనీ ప్రతిష్టను భంగపర్చినట్టు అవుతుందని వెల్లడించింది.భారతదేశంలో తయారయ్యేటటువంటి మోండెలేజ్, క్యాడ్‌బరి ప్రొడక్టులతో సంబంధం లేదని తెలియజేసింది.
ఇండియాలో తయారయ్యే తమ ప్రొడక్టులన్నీ కూడా 100% శాకాహారపూరితమేనని క్లారిటీ ఇచ్చింది.చాకెట్లపై ఉండే గ్రీన్ డాట్ వ్రాపర్ శాకాహారానికి గుర్తు అని క్యాడ్ బరీ కంపెనీ తెలియజేసింది.
అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ఫేక్ సమాచారాన్ని వైరల్ చేయడం తప్పని పేర్కొంది.వినియోగదారులు ఇటువంటి వాటిని నమ్మవద్దని సూచించింది.
