ట్రాయ్‌ కొత్త రూల్స్‌ నేపథ్యంలో డీటీహెచ్‌, కేబుల్‌ టీవీల్లో ఏది బెటర్‌.. రెంటికి మద్య ఇవి తేడాలు

కేంద్ర ప్రభుత్వం ఈమద్య కాలంలో సామాన్యుడిపై మోపిన మరో భారం కేబుల్‌ బిల్లు.ట్రాయ్‌ కొత్త నిబంధనలు సామాన్యుల పాలిట పెద్ద శాపంగా మారింది.

 Cable Tv Services Are Dth Services Which Is Better-TeluguStop.com

ఛానల్స్‌ యాజమాన్యాలు పండుగ చేసుకుంటున్న ఈ విధానంతో సామాన్యులు టీవీ పెట్టాలంటే భయపడుతున్నారు.మరీ దారుణంగా రేట్లు ఉన్నాయి.

మొన్నటి వరకు రెండు వందల నుండి మూడు వందల వరకు ఛానెల్స్‌ కేవలం 200 నుండి 250 రూపాయలకే వచ్చేవి.కాని ఇప్పుడు ఆ ఛానెల్స్‌ అన్ని రావాలంటే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

కేబుల్‌ కనెక్షన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెట్‌ అప్‌ బాక్స్‌లు పెట్టుకోవాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చింది ఇందుకేనా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని ఊహించలేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యమైన జెమిని, ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఛానెల్స్‌ చూడాలి అంటే వందలకు వందలు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది.తెలుగు ప్యాకేజీ తక్కువలో తక్కువ 250 రూపాయలు ఉంటుంది.

మొన్నటి వరకు ఊర్లలో 100 నుండి 150 రూపాయలు మాత్రమే తీసుకునే వారు.కాని ఇప్పుడు మారిన విధానం కారణంగా 300 మినిమం అవుతుంది.

ఛానెల్స్‌ ఎంపిక చేసుకుని, మీకు ఇష్టమైన వాటికే డబ్బు చెల్లించండి అంటూ ప్రభుత్వం చెబుతున్నా కూడా ఒక్కో ఛానెల్‌ రేట్లు చాలా ఉండటం వల్ల సామాన్యులు ఆలోచనలో పడ్డారు.మారిన ట్రాయ్‌ నిబంధనలతో కేబుల్‌ టీవీ బెటరా లేదంటే డీటీహెచ్‌ బెటరా అనే విషయాన్ని వినియోగదారులు తేల్చుకోలేక పోతున్నారు.కేబుల్‌ టీవీ ఆపరేటర్లు తమ చేతిలో ఏం లేదని వందలకు వందలు వసూళ్లు చేస్తున్నారు.

ఉదాహరణకు ఒక్క మాటీవీ కావాలనుకున్నా కూడా 100 ఫ్రీ ఛానెల్స్‌ మరియు మాటీవీకి 150కి అదనంగా 19 రూపాయల ఛానెల్‌ అమౌంట్‌, 20 రూపాయల సర్వీస్‌ చార్జ్‌.అంటే 200 రూపాయలన్నమాట.ఇక జెమిని, జీ, ఈ టి‌వి ఛానెల్స్ కూడా కావాలంటే 350 రూపాయలు కక్కాల్సిందే.

కానీ డి‌టి‌హెచ్ లో మాత్రం కాస్త బెటర్.ఫ్యాక్ ల పేరుతో డి‌టి‌హెచ్ లు తక్కువ రేటుకే చానల్స్ ను ఇస్తుంది.

కనుక ప్రస్తుత పరిస్తితుల్లో కేబుల్ టి‌వి కంటే కూడా డి‌టి‌హెచ్ చాలా బెటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube