విమానంలో తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన మంత్రి..శభాష్ అన్న మోడీ!

మన దేశ రాజకీయాల్లో మాములు ప్రజలు మాత్రమే కాదు వైద్యులు, సినిమా తారలు కూడా ఉన్నారు.వారు రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తమ వృత్తిని పక్కన పెట్టి మరి ప్రజలకు మంచి పనులు చేయాలనీ రాజకీయా ల్లోకి తెరంగేట్రం చేస్తూ ఉంటారు.

 Cabinet Minister Saves Life Of A Passenger Mid-air Details, Delhi-mumbai Indi,go-TeluguStop.com

ఇప్పటికే మన దేశంలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.ఎమ్మెల్యే లుగా.

కేంద్ర మంత్రులుగా.ఎంపీలు గా.సీఎం లుగా.రాజకీయాల్లో సేవలు చేసిన వారు చాలా మందే ఉన్నారు.

ఇక వీరిలో వైద్యులు కూడా ఉన్నారు.వీరి లిస్ట్ కూడా కాస్త పెద్ద గానే ఉంది.ఇలా రాజకీయాల్లో కొనసాగుతూనే వైద్య వృత్తిని కూడా వదలకుండా ఉన్న వారు చాలా మంది ఉన్నారు.వీరు ఎంత పెద్ద పదవిలో ఉన్న కుడా తమతో ఉన్న వారికీ ఆరోగ్యం బాగాలేకపోతే తక్షణమే స్పందించి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడి.

వైద్య వృత్తి పై వారికీ ఉన్న మమకారాన్ని రుజువు చేస్తూనే ఉంటారు.

ఇక తాజాగా వృత్తిరీత్యా వైద్యుడు అయినా కేంద్ర మంత్రి తనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయానికుడికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి ఆయనను ప్రశంసించారు.ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరా అనుకుంటున్నారా.కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి భగవత్ కరాడ్ మంగళవారం ఢీల్లీ నుండి ముంబై వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

విమానంలో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికుడు అస్వస్థతకు గురి అవ్వడంతో ఆయనకు చికిత్స అందించి ఆయనను కాపాడారు.తలనొప్పితో పాటు బీపీ లెవల్స్ కూడా పడిపోవడంతో వెంటనే గమనించిన ఆయన ఆ ప్రయాణికుడికి వైద్యం అందించి కాపాడారు.ఈ ఘటనను సోషల్ మీడియాలో ఇండిగో సంస్థ షేర్ చెయ్యడంతో ఈ ఘటనపై మోడీ స్పందించి కేంద్ర మంత్రిని ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube