సినిమా పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష అనుభవించాల్సిందే!  

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం ఎ స్థాయిలో వుందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలని కూడా పైరసీ ముఠాలు రిలీజ్ అయిన రోజే ఆన్ లైన్ లో రిలీజ్ చేసి నిర్మాతలకి భారీ నష్టాలు తెస్తున్నారు. ఈ పైరసీ కారణంగా ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఓ ఐదు వందల కోట్ల వరకు నష్టపోతుందని ట్రేడ్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు . అయితే పైరసీని నియంత్రించడానికి నిర్మాతలు, సైబర్ క్రైం పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన అసలు ఆపలేకపోతున్నారు.

ఇదిలా వుంటే తాజాగా పైరసీపై నిరోధక చట్టానికి కేంద్రం ఆమోదం తెలియజేసింది. ఇకపై పైరసీ చేసిన, పైరసీ సినిమాలు చూసిన కూడా సినిమాటోగ్రఫీ చట్టం క్రింద కాపీ రైట్ యాక్ట్ క్రింద చట్టరీత్య నేరంగా పరిగణించడం జరుగుతుందని, పైరసీకి పాల్పడి దొరికితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని ప్రొడ్యూసర్ గిల్డ్ ప్రెసిడెంట్ సిద్దార్ద్ రాయ్ కపూర్ స్పష్టం చేసారు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఈ చట్టంతో పైరసీని ఎంత కంట్రోల్ అవుతుంది అనేది చూడాలి.