ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె ఫోటోలు తీసి బలవంతం చేయబోయాడు.! ఆమె తెలివిగా ఎలా తప్పించుకుందో తెలుసా.?

ఛీ.ఛీ… ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.క‌ఠిన శిక్ష‌లు వేస్తున్నామ‌ని చెప్పుకుంటున్నా.కొంద‌రు ప్ర‌బుద్ధులు మాత్రం ఇంకా నీచ‌మైన ప‌నులు చేయ‌డం మాన‌డం లేదు.ఆడ‌వారు క‌నిపిస్తే చాలు, అస‌భ్య‌క‌రమైన ప‌నులు చేస్తున్నారు.ప‌త్రిక‌ల్లో రాయ‌డానికి, చాన‌ళ్ల‌లో చూపించ‌డానికే సిగ్గు ప‌డేలా అత్యంత నీచ‌మైన ప‌నుల‌కు ఒడిగ‌డుతున్నారు.

 Cab Driver Nunchi Telivi Ga Tappinchu Kunna Mahila-TeluguStop.com

మన దేశంలో మహిళలకు స్థానం లేదు.అవును, మీరు విన్నది నిజమే.స్త్రీలు గౌరవించబడే చోట, వారికి మర్యాద దక్కే చోట మాత్రమే వారికి స్థానం ఉంటుంది.అలా మన దేశంలో పరిస్థితులు లేవు.కనుక వారికి మన దేశంలో స్థానం లేదు.ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన వింటే మీరే అలా అంటారు.

రేప్‌లు అనేవి నేటి తరుణంలో ఎంత కామన్‌ అయ్యాయంటే.నేరస్తులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

కానీ వారికి కఠినమైన శిక్షలు పడడం లేదు.పడినా ఎప్పటికో అవి అమలు అవుతున్నాయి.

కనుకనే మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

బెంగళూరులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు.

క్యాబ్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువతిని లైంగికంగా వేధించాడు.అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

శుక్రవారం (జూన్ 1) రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

ఆర్కిటెక్ట్ అయిన 26 ఏళ్ల ఓ యువతి పని నిమిత్తం బెంగళూరు నుంచి ముంబై బయలుదేరింది.తాను ప్రయాణించాల్సిన విమానం శుక్రవారం ఉదయం 2 గంటలకు ఉండటంతో.

దాన్ని అందుకోడానికి అర్ధరాత్రి తర్వాత క్యాబ్ బుక్ చేసుకుంది.ఒంటరిగా బయలుదేరిన యువతిపై క్యాబ్ డ్రైవర్ కన్నేశాడు.

సరైన దారిని వదిలేసి ఓలా డ్రైవర్ క్యాబ్‌ను పక్కదారికి తిప్పాడు.అనుమానం వచ్చి ప్రశ్నించిన యువతిని ఆ దారిలో వెళితే.

ఎయిర్‌పోర్టుకు త్వరగా చేరతామని నమ్మబలికాడు.ఆ తర్వాత ఓ నిర్మానుష్య ప్రదేశం వద్ద క్యాబ్‌ను ఓ పక్కకు నిలిపేసి, డోర్ లాక్ చేశాడు.

యువతిపై అఘాయిత్యం చేయడానికి సిద్ధమయ్యాడు.

యువతిని బెదిరించాడు.బలవంతంగా ఆమె దుస్తులు తొలగించి అసభ్యకరమైన ఫొటోలు తీశాడు.వాటిని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపించాడు.

పోలీసులకు ఫోన్ చేస్తే.మిత్రులను రప్పించి గ్యాంగ్ రేప్ చేస్తానని యువతిని బెదిరించాడు.

ఎదిరిస్తే లాభం లేదనుకున్న యువతి.నెమ్మదిగా అతణ్ని ప్రాదేయపడింది.

తనను ఏం చేయొద్దనీ, విషయం ఎవరికీ చెప్పననీ బతిమాలింది.

యువతి మాటలకు కన్విన్స్ అయిన డ్రైవర్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత ఆమె జరిగిన ఘటనను వివరిస్తూ బెంగళూరు పోలీసులకు ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.3 గంటల్లోగా నిందితుణ్ని అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube