క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన సినీ నటి ముమైత్ ఖాన్!  

cab driver alleges mumaith khan cheated him, Mumaith Khan, Cab Driver Raju, Mumaith Goa Trip, Drivers Association, Maisamma IPS - Telugu Cab Driver Raju, Drivers Association, Maisamma Ips, Mumaith Goa Trip, Mumaith Khan

రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు సినీ నటి, డ్యాన్సర్ మొమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఐటెం సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ముమైత్ తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.200కు పైగా సినిమాల్లో నటించిన ముమైత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17 సంవత్సరాలైనా వరుస అవకాశాలతో బిజీగా ఉంది.

TeluguStop.com - Cab Driver Alleges Mumaith Khan Cheated Him

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న ముమైత్ ఆ సమయంలో డ్రగ్స్ వివాదం ద్వారా పాపులర్ అయింది.

అయితే ఆ వివాదానికి సంబంధించి నమోదైన కేసు ఏమైందో ఎవరికీ తెలియదు.అయితే తాజాగా ముమైత్ ఖాన్ ను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది.హైదరాబాద్ కు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ముమైత్ ఖాన్ తనకు 15 వేల రూపాయలు ఎగ్గొట్టిందని మీడియాకు తెలిపారు.ఇదే విషయాన్ని రాజు క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.

TeluguStop.com - క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన సినీ నటి ముమైత్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొదట అసోసియేషన్ లో చర్చించి అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే పోలీసుల దగ్గరకు వెళతానని.తనకు న్యాయం తప్పక జరగాలని రాజు చెబుతున్నారు.

ముమైత్ ఖాన్ హైదరాబాద్ నుంచి గోవాకు మూడు రోజుల ట్రిప్ కోసం కారును మాట్లాడుకుందని.అయితే ఆ తర్వాత ట్రిప్ ను ఎనిమిదిరోజులకు పొడిగించిందని.

టోల్ ఛార్జీలు కూడా తానే చెల్లించానని, డ్రైవర్ అకామడేషన్ చార్జీలు కూడా ముమైత్ చెల్లించలేదని రాజు చెప్పారు.

తనకు ఎదురైన అనుభవం మరో డ్రైవర్ కు ఎదురు కాకుండా ఉండాలని తాను డ్రైవర్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశానని అన్నారు.

తెలుగులో చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించిన ముమైత్ ఖాన్ పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లోనూ నటించింది.ముమైత్ పై ఇలాంటి ఆరోపణలు వ్యక్తం కావడంతో ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

#Maisamma IPS #Mumaith Khan #Cab Driver Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cab Driver Alleges Mumaith Khan Cheated Him Related Telugu News,Photos/Pics,Images..