ఈసారి బాలయ్యను పిలిచాం కాని ఆయనే రానన్నాడు  

C Kalyan Film Industry Meeting Ys Jagan - Telugu Ap Cm Jagan, Balakrishna, C Kalyan, Chiranjeevi, Film Industry Meeting

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్లి కలిసిన విషయం తెల్సిందే.సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు షూటింగ్స్‌కు ఎప్పుడు వెళ్లాలి అనే విషయాలపై చర్చించారు.

 C Kalyan Film Industry Meeting Ys Jagan

కేసీఆర్‌తో భేటీకి తనను ఆహ్వానించక పోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య ఏకంగా భూములు పంచుకునేందుకు భేటీ అయ్యారేమో అంటూ విమర్శలు చేశాడు.
బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపిన నేపథ్యంలో ఈనెల 9న జరుగబోతున్న ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీకి ఆయన్ను ఆహ్వానించారు.

సీఎంతో చిరంజీవి సారధ్యంలో సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా బాలకృష్ణకు ఆహ్వానం పంపించాం.కాని ఆయన పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయంటూ భేటీకి హాజరు కాలేను అన్నాడని నిర్మాత సి కళ్యాణ్‌ పేర్కొన్నాడు.

ఈసారి బాలయ్యను పిలిచాం కాని ఆయనే రానన్నాడు-Movie-Telugu Tollywood Photo Image

ఏపీ సీఎం జగన్‌తో భేటీపై ఆసక్తి లేని కారణంగానే అది కాకుండా చిరంజీవి సారధ్యంలో భేటీకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో బాలకృష్ణ ఈసారి భేటీకి నో చెప్పాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆహ్వానించలేదు అంటూ విమర్శలు చేసిన బాలకృష్ణ ఈసారి ఆహ్వానిస్తే ఎందుకు వెళ్లడం లేదు అంటూ కొందరు మెగా ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో బాలకృష్ణదే తప్పు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test