నెల రోజుల క్రితం భారతదేశంలో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో, భారతదేశ ప్రజల సమాచార గోప్యతకు చెందిన విషయంలో బైట్ డాన్స్ సంస్థ కు చెందిన టిక్ టాక్ తో పాటు వందకు పైన చైనా దేశపు అప్లికేషన్లను బ్యాన్ చేసిన సంగతి విదితమే.
ఇకపోతే బైట్ డాన్స్ కు చెందిన టిక్ టాక్ విషయంలో అమెరికా కూడా గత వారం బ్యాన్ ను విధించింది.
అంతేకాకుండా టిక్ టాక్ ఈ విషయంలో అమెరికా పూర్తిగా అమ్మేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.ఇక తాజాగా అమెరికా దేశంలోని టిక్ టాక్ ఆపరేషన్స్ కు సంబంధించి ఆస్తులను మరో మూడు నెలల్లో అమ్మేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ను విధించారు.
దేశ అంతర్గత భద్రతకు, అలాగే కొన్ని ప్రైవసీ వాటికి సంబంధించి భంగం కలుగుతుందనే నేపథ్యంలో చైనా దేశానికి చెందిన మొబైల్ యాప్స్ టిక్ టాక్, ఉయ్ ఛాట్ ను బ్యాన్ చేస్తూ గత వారంలో ఆర్డర్స్ జారీ చేశారు.ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి.
ఇక బైట్ డాన్స్ అని చెప్పి కొనడానికి మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ మూడున్నర సంవత్సరాలు అమెరికా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అమెరికా దేశానికి సంబంధించిన బిజినెస్ ను ఏ సంస్థ అయినా సరే టిక్ టాక్ ను కొనుగోలు చేసిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.
కాకపోతే కచ్చితంగా టిక్ టాక్ అమెరికా ఆపరేషన్స్ మీ ఆ సంస్థలో మొత్తం కొనుగోలు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.మొత్తంగా అమెరికా లో టిక్ టాక్ కు సంబంధించిన పూర్తి ఆస్తులను బైట్ డ్యాన్స్ 90 రోజుల్లో అమ్మకం ప్రక్రియ పూర్తి చేయాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.