ఫలితాల ఎఫెక్ట్: పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా రావడంతో ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేతగా ఉన్న సిద్ది రామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 Bypolls Siddaramaiah And Gundurao-TeluguStop.com

ఉప ఎన్నికల్లో పదిహేను స్థానాలకు గాను బిజెపి పన్నెండు చోట్ల గెలవగా, రెండు సీట్లనే కాంగ్రెస్ దక్కించుకుంది.దీంతో కాంగ్రెస్ అదికారం చేపట్టే అవకాశం లేకుండాపోయింది.

ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.కాగా పిసిపి అద్యక్షుడు దినేష్ గుండూరావు కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

యడియూరప్ప సీఎం పదవికి ఎలాంటి ఢోడా లేదు.ఈ క్రమంలో బై పోల్ ఓటమికి బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ,జేడీఎస్ ప్రభుత్వ వైఖరిని విబేధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.దీంతో కుమారస్వామి తన సీఎం పదవిని కోల్పోయారు.

ఈ సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ ఈ శాసనసభ గడువు ముగిసేవరకు పోటీ చేయడానికి వీల్లేకుండా వేటు వేశారు.అయితే, స్పీకర్ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దీంతో రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున పోటీ చేశారు.వారి వల్లే తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్న యడియూరప్ప వారికి తన కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తానని గతంలో ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube