లావెక్కుతున్న భారతదేశం - 2025 నాటికి వినబోతున్నాం చేదు నిజం

“భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో బాగా పోటిపడుతోంది.వారితో పాటు చాలా విషయాల్లో సమానంగా మనం ఎదుగుతున్నాం.

 By 2025, India Could Be The Most Obese Country In The World-TeluguStop.com

పోషకాహార లోపం చాలావరకు తగ్గంది మన దేశంలో.కాని ఆహారపు సమస్యలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి” అంటూ డాక్టర్ తాపస్ మిశ్రా ఇటివలే హైదరాబాద్‌లో జరిగిన ‘ఒబేసిటి ఎపెడిమిక్ ఇన్ ఇండియా’ సదస్సులో వాఖ్యానించారు.

అన్నిరకాలుగా దేశం అభివృద్ధి చెందుతోంది.మంచితో పాటు చెడుని కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోంచి నేర్చుకుంటున్నాం మనం.మరీ ముఖ్యంగా అహారపు అలవాట్లు.సరైన ఆహారపు అలవాట్లు లేక భారతదేశం లావెక్కిపోతోంది.

ప్రజలు అలవరచుకుంటున్న ఆహారపు అలవాట్ల వలన రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి.ఉబకాయం మన ప్రజల్లో రోజురోజుకి పెరిగిపోతోంది.

ప్రస్తుతం ఆధికబరువు సమస్యలతో బాధపడుతున్న దేశాల్లో భారతదేశానిది మూడొవస్థానం.అమెరికా, చైనా తొలిరెండు స్థానాల్లో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం భారతదేశంలో అధికబరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది.ఒబేసిటి రేట్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2025 సంవత్సరానికల్లా ప్రపంచంలోనే అత్యంత లావెక్కిన దేశంగా భారత్ నిలబడనుందని హైదరాబాద్ సదస్సులో వక్తలు చెప్పుకొచ్చారు.

భారతదేశ ప్రజలు కష్టపడాల్సిన సమయం వచ్చిందని, మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా, మంచి షేప్ లో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుందని హెచ్చరించారు డాక్టర్ తాపస్ మిశ్రా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube