పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్?

తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పరంగా నంబర్ 1 హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది.హిట్లూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు అభిమానులను పెంచుకుంటున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.

 Buzz On Pawan Kalyan And Harish Shankar Movie, Pawan Kalyan, Gabbar Singh, Mythr-TeluguStop.com

అజ్ఞాతవాసి సినిమా తరువాత కొన్నేళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్న పవన్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ దర్శకత్వంలో నటించనున్నారు.పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు పవన్ అభిమానులకు విందు భోజనం లాంటి సినిమాగా నిలిచింది.పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో హరీష్ ఆ సినిమాలో అలానే చూపించారు.

దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా.? ఎప్పుడు విడుదలవుతుందా.? అనే ఆత్రుత పవన్ అభిమానుల్లో కనిపిస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

హరీష్ కమర్షియల్ సినిమానే తెరకెక్కిస్తున్నప్పటికీ సినిమాలో అంతర్లీనంగా మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమాలో కూడా పవన్ పోలీస్ గానే కనిపించబోతున్నాడని సమాచారం.

అయితే పవన్ ను పోలీస్ పాత్రలో కొత్తగా హరీష్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.మరోసారి గబ్బర్ సింగ్ కాంబోలో పవన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారనే వార్తతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా పవన్ కెరీర్ లో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube