ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో నిరాశ.. రాధేశ్యామ్‌లో అవి లేవట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు.ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

 Buzz Of No Fighting Scenes In Radhe Shyam, Radhe Shyam, Prabhas, Pooja Hegde, Ra-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడంతో వారు మరింత నిరాశకు గురవుతున్నారు.అయితే వారికి ఊరట కలిగించేందుకు ప్రభాస్ పుట్టినరోజున ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా టీజర్ కాకుండా కేవలం మోషన్ పోస్టర్‌నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే విషయంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమాను పూర్తిగా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.దీంతో ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోవని, అందుకే ఈ సినిమా టీజర్‌ను కాకుండా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇప్పుడు ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన మరింత పెరిగింది.బాహుబలి, సాహో వంటి బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రాల తరువాత ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ చిత్రంలో యాక్షన్ సీన్స్ లేకపోతే ఆ సినిమా ఎలా ఉంటుందా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సినిమాను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని వారు ఆలోచిస్తున్నారు.ఏదేమైనా ప్రభాస్ సినిమాను ఇలా యాక్షన్ లేకుండా ఊహించుకోలేం అని వారు అంటున్నారు.

మొత్తానికి రాధేశ్యామ్ చిత్రంపై వస్తున్న వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను మరింత నిరాశకు గురిచేసేలా ఉండటంతో, చిత్ర యూనిట్ వెంటనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube