అవును, మీరు విన్నది నిజమే.అదొక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.
ఒప్పో రెనో 10 సిరీస్‌లో ఇండియాలో 3 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అయిన సంగతి మొబైల్స్ ప్రేమికులైన మీకు బాగా తెలుసు.అవే ఒప్పో రెనో 10, ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ అనే 3 మోడల్స్.
ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఇపుడు అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది ఒప్పో ఇండియా.ఒప్పో రెనో 10 సిరీస్‌లో రిలీజైన స్మార్ట్‌ఫోన్ కొని దుబాయ్ ట్రిప్ గెలుచుకోవచ్చు.
అవును, దీనికోసం కస్టమర్లు చేయాల్సిందల్లా ఒప్పో రెనో 10 ప్రో లేదా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ఏదో ఒక మొబైల్‌ని కొనాలి… అంతే.అది కూడా జూలై 13 నుంచి జూలై 19 మధ్య కొనేవారికే ఈ ఛాన్స్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
దానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉందని మర్చిపోవద్దు.

అయితే ఇక్కడ అదెలా కుదురుతుంది అని మీరు అనుకోవచ్చు.లక్కీ డ్రా ద్వారా దుబాయ్ ట్రిప్‌కు వెళ్లేవారిని సెలెక్ట్ చేస్తుంది ఒప్పో.గెలిచినవారికి దుబాయ్ వెళ్లిరావడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, లగ్జరీ హోటల్స్‌లో వసతి, భోజనం, దుబాయ్‌లో ఎక్స్‌క్లూజీవ్ టూర్స్ ఉచితంగా లభిస్తాయి.
అదనపు ఖర్చులు అయితే మాత్రం ఎవరికి వారు పెట్టుకోవలసిందే.ఇందులో గెలిస్తే దుబాయ్ ట్రిప్ మాత్రమే కాదండోయ్… ఒప్పో ప్యాడ్ ఎయిర్, ఒప్పో ఎన్‌కో ఎయిర్ 2ఐ కూడా గెలుచుకోవచ్చు.
రివార్డ్ పాయింట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.ఇవన్నీ సొంతం చేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

1.ఆన్‌లైన్ లేదా రీటైల్ స్టోర్‌లో ఒప్పో రెనో 10 ప్రో లేదా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ కొనాలి.
2.దానికోసం మొదట మైఒప్పో అకౌంట్‌లో లాగిన్ కావాలి.
3.తరువాత ఇ-వారెంటీ యాక్టివేట్ చేసుకోవాలి.
4.ఆ తరువాత Buy & Win బ్యానర్ పైన క్లిక్ చేసి, నియమనిబంధనలన్నీ చదివి కాంటెస్ట్‌లో పాల్గొనాలి.
మొబైల్ ఫీచర్లు:
1.ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.54,999.
2.120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల అమొలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ కలదు.
3.100వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
4.64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.