ఇది విన్నారా...? అందులో కేవలం రూ.5కే బంగారం కొనవచ్చు...!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.అమెజాన్ కు చెందిన అమెజాన్ పేలో వినియోగదారులకు ఉపయోగపడేలా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

 Amazon Pay Launches Gold Vault Scheme, Buy Gold From Rs.5, Gold Scheme, Amazon P-TeluguStop.com

మనీని సేవ్ చేసుకుంటు గోల్డ్ ని పొందవచ్చు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది.

డిజిటల్ మార్కెంటింగ్ లో పలు మార్పులు చేస్తూ ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్ డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

అయితే అమెజాన్ పే కూడా గోల్డ్ వాల్ట్ పేరుతో కొత్త ఫీచర్ ను ప్రారంభించింది.వినియోగదారులు కేవలం రూ.5కే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.అయితే ఈ స్కీంతో బంగారం మన చేతికి రాదు.పెట్టుబడి రూపంలో డబ్బును బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు.దీనికి సంబంధించి వినియోగదారులు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు.కస్టమర్లు నచ్చినప్పుడు అమెజాన్ పేలో మీకు నచ్చినప్పుడల్లా చిన్న మొత్తాన్ని బంగారాన్ని డిజిటల్ రూపంలో పెట్టుబడి పెడితే చాలు.

అలా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మీకు వీలు కుదిరినప్పుడు డ్రా చేసుకోవచ్చు.లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన సొమ్ముతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Telugu Gold, Amazon Offers, Amazon Pay, Amazonpay, Buy Gold Rs, Commerce, Gold S

వినియోగదారులు అమెజాన్ పే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని గోల్డ్ వాల్ట్ లో రిజిస్టర్ అవ్వాలని సంస్థ పేర్కొంది.నచ్చిన విధంగా స్కీంను సెలెక్ట్ చేసుకుని పెట్టుబడి పెడితే చాలన్నారు.స్కీం కాలపరిమితి ముగిసిన తర్వాత మీ ఖాతాలో ఉన్న డబ్బుతో బంగారాన్ని లేదా సొమ్మును పొందవచ్చని సంస్థ పేర్కొంది.ఒకే సారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ ఫీచర్ స్కీం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.99.5 శాతం స్వచ్ఛమైన బంగారం దొరుకుతుందని, 24 క్యారెట్ బంగారం అందిస్తామని అమెజాన్ పే ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube