మందుబాబులకు గుడ్ న్యూస్.. కిరాణ కొట్టులో మద్యం!

కిరాణ కొట్టు అంటే ఏంటి ? అసలు కిరాణ కొట్టులో ఏం దొరుకుతాయి ? ఒక ఊరిలో ఉండే కిరాణ కొట్టులో ఉప్పు, పప్పు, సబ్బులు, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి.కానీ ఇదేంటి కిరాణ కొట్టులో మద్యం దొరుకుతుంది అంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.

 Buy Alcohol In Kirana Stores Also-TeluguStop.com

ఈ ప్రభుత్వం ఏమైనా తాగి మాట్లాడుతుందా ఏంటి అని మీకు సందేహం రావచ్చు.

కానీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తాగలేదు.

ఆ మందు తాగే మందుబాబులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది … అది ఏంటి అంటే.ఎంతైనా తాగండి.

ఏలాంటి గలాటా అయినా చెయ్యండి.మీరు మందు కోసం ఎక్కువ కష్టపడకుండా.

శ్రమించకుండా.షాప్ కు వెళ్లి తెచ్చుకోకుండా.

మీకు అందుబాటులోకి.అంటే కిరాణా కొట్టులోకి మద్యాన్ని తెస్తాం అంటుంది ప్రభుత్వం.

మీకు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించిన ఇది పచ్చి నిజం.నిప్పులాంటి నిజం.అయితే ఈ అద్భుత అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.పంజాబ్ రాష్ట్రంలో ఈ అద్భుతమైన బంపర్ ఆఫర్ ను మందుబాబులకు ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది.

ఆ పాలసీ ప్రకారం.ఫారిన్, ఇంపోర్టడ్ లిక్కర్ కిరాణా షాపుల్లోనూ అమ్ముతారు.ఆలా అమ్మడానికి ప్రభుత్వం L2B లైసెన్స్ ఇవ్వనుంది.గతంలో డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో మాత్రమే ఫారిన్ లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

ఇకపై కిరణా షాపుల్లోనూ అమ్మకాలు జరుపుతారు.అయితే ఈ బంపర్ ఆఫర్ ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది.

మరి ఈ కొత్త మద్యం పాలసీతో వచ్చే నష్టాలు.లాభాలు ఏంటి తెలియాలి అంటే ఏప్రిల్ నెల వరుకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube