అరుదైన సీతాకోక చిలుక.. ఎప్పుడైనా చూశారా ?

ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.గతంలో ఎన్నడూ ఎక్కడ చూడని ఫోటోలు అన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

 Butterfly Looks Dead Leaf When It Closes Its Wings  Butterfly, Dead Leaf, Wings,-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఓ అరుదైన సీతాకోక చిలుక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఎందుకంటే అది కనిపించడానికి ఆకులా కనిపిస్తుంది.

కానీ దాన్ని ముట్టకనే తెలుస్తుంది అది సీతాకోక చిలుక అని.

సాధారణంగానే సీతాకోక చిలుకలు ఎన్నో రంగు రంగులతో అందంగా చూడముచ్చటగా ఉంటాయి.మనం ఎప్పుడు అలాంటి సీతా కోకచిలుకలను ఎన్నో చూసి ఉంటాం.కానీ ఒక సీతాకోకచిలుక మాత్రం అచ్చం ఆకులా ఉంటుంది.దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

18 సెకండ్లు నిడివి ఉన్న ఈ వీడియోను భారతీయ అటవీశాఖ అధికారి ప్రవీణ్ అంగుస్వామి షేర్ చేశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరూ ఇది చూడటానికి ఆకులా ఉంది.కానీ దగ్గరకు వెళ్తేనే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.