బుట్టబొమ్మా.. రికార్డుల మోతకు అడ్డులేదమ్మా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలవడమే కాకుండా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.

 Buttabomma Song Ready For Another Milestone Record-TeluguStop.com

బన్నీ నటించిన ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం ఖచ్చితంగా సంగీతం అనే చెప్పాలి.

థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతటి బలాన్ని అందించిందో ఈ సినిమా పాటలు వింటే తెలుస్తోంది.సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మా.వంటి పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి.ఈ పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను సైతం క్రియేట్ చేశాయి.

 Buttabomma Song Ready For Another Milestone Record-బుట్టబొమ్మా.. రికార్డుల మోతకు అడ్డులేదమ్మా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవల బుట్టబొమ్మ సాంగ్ యూట్యూ్బ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఏకంగా 150 మిలియన్ వ్యూస్‌ మార్క్‌ను దాటేందుకు రెడీ అవుతోంది ఈ పాట.బుట్టబొమ్మా అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌కు థమన్ అదిరిపోయే ట్యూన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులను మెప్పించడంలో అల వైకుంఠపురములో సినిమా విజయం సాధించింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంటుందో చూడాలి.

#Trivikram #Thaman #Buttabomma Song #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు