టాలీవుడ్ మరో అరుదైన ఘనతని అందుకున్న బుట్టబొమ్మ

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అల్లు అర్జున్ కెరియర్ హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది.

 Buttabomma Song Crossed 600 Million Views-TeluguStop.com

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ని మరింతగా ఈ సినిమా హైప్ చేసింది.ఈ నేపధ్యంలో నెక్స్ట్ లెవల్ అంటూ పుష్ప సినిమాతో బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కి ముందే సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

 Buttabomma Song Crossed 600 Million Views-టాలీవుడ్ మరో అరుదైన ఘనతని అందుకున్న బుట్టబొమ్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందుగా వచ్చిన సామజవరగమనా అనే సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేసుకొని సినిమాకి ఊహించని హైప్ క్రియేట్ చేసింది.తరువాత రాములో రాములా సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయ్యింది.

బుట్టబొమ్మ కూడా హిట్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేయడం మొదలు పెట్టింది.

ఈ సాంగ్ లో వేసిన స్టెప్పుల కారణంగా టిక్ టాక్ వీడియో లతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బుట్టబొమ్మ సాంగ్ వైరల్ అయ్యింది.ఆస్త్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులు వేయడంతో యూనివర్శల్ వైజ్ గా ఈ సాంగ్ కి మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో యుట్యూబ్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇప్పటికే టాలీవుడ్ హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ని నమోదు చేసుకున్న ఈ బుట్టబొమ్మ సాంగ్ ఇప్పుడు మరో అరుదైన ఫీట్ ని రీచ్ అయ్యింది.సౌత్ లో సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ తర్వాత 600 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

#MusicDirector #Buttabomma Song #Trivikram #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు