యుట్యూబ్ లో దుమ్ము దులుపుతున్న బుట్టబొమ్మ వీడియో సాంగ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.బన్నీ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.

 Butta Bomma Video Song Sensation In You Tube-TeluguStop.com

త్రివిక్రమ్, బన్నీ కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఎవరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంటే.ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది.

ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ఇందులో పాటలు కూడా అంతే స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి.సినిమా రిలీజ్ కి ముందే ఇందులో పాటలు సంచలనం సృష్టించి ట్రెండ్ అయ్యాయి.

క్లాస్, మాస్, మెలోడీ సాంగ్స్ ఇష్టపడే ఆడియన్స్ అందరికి సరిపోయే పాటలు ఇందులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన వీడియో సాంగ్స్ యుట్యూబ్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఇప్పటికే సామజవరగమన వీడియో సాంగ్ యుట్యూబ్ లో రిలీజ్ అయ్యి షేక్ చేసింది.రికార్డ్ స్థాయిలో ఈ సాంగ్స్ వ్యూస్ సొంతం చేసుకుంది.ఇప్పుడు ఇందులో మరో సూపర్ హిట్ గా నిలిచిన బుట్టబొమ్మ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు.ఈ సాంగ్ రిలీజ్ అయ్యి గంటల వ్యవధిలోనే ఏకంగా ఆరు లక్షలకి పైగా వ్యూస్ ని క్రాస్ చేసింది.

ఇంత వేగంగా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యే సాంగ్ ల జాబితాలో బుట్టబొమ్మ టాప్ లో ఉంది అని చెప్పాలి.ఇక ఇప్పటికే ఈ సాంగ్ బాలీవుడ్ సెలబ్రిటీలని సైతం ఫిదా చేస్తూ ఉండటంతో పాటు టిక్ టాక్ లో ట్రెండింగ్ సాంగ్ గా దూసుకుపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube