బుట్ట బొమ్మా అల వైకుంఠపురుములో కాదట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు బన్నీ.

 Butta Bomma, Ala Vaikunthapuramulo, Allu Arjun,trivikram, Thaman-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన మార్క్ టేకింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.ఇక ఈ రొటీన్ కమర్షియల్ సినిమాకు ప్రాణం పోసింది మాత్రం థమన్ సంగీతం అని చెప్పాలి.

థమన్ కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్‌ను అల వైకుంఠపురములో సినిమాకు అందించాడు.ఈ సినిమాలోని సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మా వంటి పాటలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా థమన్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మా సాంగ్ ఇంత పాపులర్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకోలేదట.

అసలు ఆ పాట ఈ సినిమా కోసం అనుకున్నది కాదని, యాక్సిడెంటల్‌గా ఆ పాటను ఈ సినిమాలో పెట్టామని థమన్ చెప్పుకొచ్చాడు.

తొలుత బుట్టబొమ్మా పాట స్థానంలో వేరే పాటను అనుకున్నామని, అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రికార్డిండ్ సమయంలో బన్నీతో బుట్టబొమ్మా పాట గురించి ప్రస్థావన రావడం, ఆయన వెంటనే ఈ పాటను అందులో పెట్టమని అనడం జరిగినట్లు థమన్ తెలిపాడు.

కేవలం మూడు రోజుల్లోనే ఈ పాట రికార్డిండ్ పూర్తయ్యిందని, ఇప్పుడు ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం నిజంగా సంతోషంగా ఉందని థమన్ చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుతం బన్నీ తన తాజా చిత్రం పుష్పను శవేగంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube