భార్యను దారుణంగా చంపిన కసాయి భర్త..!

వివాహేతర సంబంధం వద్దన్నందుకు కిరాతకంగా హత్య చేశాడు కసాయి భర్త.కత్తితో తల నరికి మొండెం వేరుచేసి కిరాతకంగా చంపేశాడు.

 Butchers Husband Brutally Kills Wife-TeluguStop.com

ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.గత కొద్దీ కాలం నుండి శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అదే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.అయితే మంగళవారం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో.

 Butchers Husband Brutally Kills Wife-భార్యను దారుణంగా చంపిన కసాయి భర్త..-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ భార్య రోడ్డుపైకి వచ్చింది.దీంతో మద్యం మత్తులో ఉన్మాదిగా మారిన శ్రీనివాసరావు కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఎన్‌ఎస్‌పీ అతిధి గృహం వద్ద దారుణం చోటు చేసుకుంది.మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై ఓ భర్త వేటకొడవలితో దాడి చేశాడు.భార్య మెడపై కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.భార్య మెడను నరికి.

ఆపై తల, మొండెంను వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు.తలను అక్కడి నుంచి దూరంగా విసిరేయడంతో తల లేని మొండెం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అనంతరం నిందితుడు శ్రీనివాసరావు వేరే చేసిన తన భార్య తలను తీసుకుని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.గత అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యన అడ్డగించిన భర్త శ్రీనివాసరావు(46)…ఆమెను దారుణంగా హత్య చేశాడు.నిందితుడు ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ ఉద్యోగిగా తెలుస్తోంది.పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

#Police #Murder #Women #Guntoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు