టీడీపీ 'ఆగస్ట్ ' సెంటిమెంట్ ! నిజం చేసిన బుచ్చయ్య ?

ఆగస్ట్ వస్తుంది అంటే చాలు టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.ఈ నెలలో ఏదో ఒక సంక్షోభం తలెత్తుతూ ఉండడం ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఆనవాయితీగా ఉంది.

 Buchayya Coowdary Makes Tdp August Crisis Comes Real,  Gorantla Buchhayya Chowda-TeluguStop.com

ప్రతి ఏడాది ఆగస్టు నెలలో టిడిపికి సంబంధించి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.ఈ ఏడాది ఆగస్టులోనూ టిడిపి లో ముసలం పుట్టింది.

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు లోకేష్ పై సంచలన విమర్శలు చేశారు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తాను సీనియర్ గా ఎన్నో సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు చేస్తున్నా, ఏమాత్రం పట్టించుకోవడం లేదని , గత కొంత కాలంగా తనను పూర్తిగా పక్కనపెట్టి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, ఇటువంటి అవమానకర పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగడం ఎందుకు అంటూ సంచలన విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.

బుచ్చయ్య ను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నా, ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.2019 ఎన్నికల నాటి నుంచి టీడీపీ ఘోర అవమానం ఎదుర్కొంటోంది.ఎప్పుడూ లేని విధంగా కేవలం 23 స్థానాల మాత్రమే ఎన్నికల్లో దక్కించుకుంది.

ఇప్పటికే ఎంతో మంది పార్టీ నాయకులు లోకేష్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఆయన కారణంగానే తాము పార్టీని వీడుతున్నాము అంటూ సంచలన స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

ఇప్పుడు పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు సీనియర్లను పక్కన పెడుతూ ఉండడం , వారి అభిప్రాయాలను గౌరవించేందుకు ఇష్టపడకపోవడం, పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం ఆ పార్టీ సీనియర్ నాయకులకు తీవ్ర అసంతృప్తి కలుగజేస్తున్నాయి.
 

Telugu August Troubles, Chandrababu, Lokesh, Tdp, Tdp August-Political

ప్రతి ఏటా ఆగస్టులో ఏదో ఒక సంక్షోభం తలెత్తుతున్నట్లు గానే ఇప్పుడు బుచ్చయ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఆయన గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేస్తూ ఉండడం  పెద్ద ఇబ్బందికరంగా మారింది.తాను పార్టీకి దూరం అవ్వడమే కాక, భవిష్యత్తులోనూ తన వారసుడు  టిడిపిలోనే కాదు, అసలు రాజకీయాల్లోకి రారు అంటూ సంచలన స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

బుచ్చయ్య పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈనెలలోనే రాజీనామా చేసే అవకాశం ఉండడంతో ఆగస్ట్ సంక్షోభం సెంటిమెంట్ రిపీట్ కాబోతోంది.అయితే బుచ్చయ్య పార్టీకి రాజీనామా చేసినా, సైలెంట్ గా అయితే ఉండరు.

ఖచ్చితంగా జరిగిపోయిన ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు లోకేష్ ను ఇరుకున పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube