పిల్లి పిల్ల కోసం బెంజ్‌ కారు ఇంజిన్‌ పగులకొట్టించాడు.. ఆరు గంటల రెస్క్యూ ఆపరేషన్‌

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ కు చెందిన ఒక వ్యాపారవేత్త ఒక చిన్న పిల్లి పిల్ల కోసం తన అత్యంత ఖరీదైన బెంజ్‌ కారు ఇంజన్‌ ను పగుల కొట్టేందుకు కూడా సిద్దం అయ్యాడు.ఇంజిన్‌ లో ఇరుక్కు పోయిన పిల్లి పిల్లను కాపాడేందుకు ఆరు గంటల పాటు ఆయనతో పాటు పలువురు ప్రయత్నించారు.

చివరకు ఆరు గంటల కృషితో కారు ఇంజన్‌ పగుల కొట్టి మెల్లగా ఆ పిల్లి పిల్లను బయటకు తీయడం జరిగింది.పిల్లి పిల్ల కోసం ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.

ఆయన చేసిన పని కాస్త వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…


సూరత్‌ కు చెందిన జయేష్‌ టైలర్‌ అనే వ్యాపారవేత్త సియోన్‌ నుండి సిద్ది వినాయక టెంపుల్‌ కు వెళ్లేందుకు బయలుజేరాడు.ఫ్యామిలీ అంతా కూడా కారులో ఎక్కారు.వారితో పాటు వారి పెంపుడు కుక్క బ్రూనో కూడా కారు ఎక్కింది.

కారు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బ్రూనో ప్రవర్తన కాస్త తేడాగా అనిపించింది.బ్రూనో కారు ఆపించేందుకు ప్రయత్నించింది.టైలర్‌కు బ్రూనో కారు ఆపించేందుకు ప్రయత్నిస్తుందని అర్థం అయ్యింది.కారు సైడ్‌ తీసుకున్నాడు.

కారు ఆపి బ్రూనోను కిందికి దించే ప్రయత్నం చేశాడు.అప్పుడు టైలర్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పిల్లి పిల్ల అరుస్తున్న సౌండ్‌ వినిపించింది.

కారులో ఎక్కడో పిల్లి పిల్ల ఉందని వారికి అర్థం అయ్యింది.అంతా నిదానంగా చూశారు.చివరకు కారు ఇంజన్‌ లో పిల్లి పిల్ల చిక్కుకు పోయింది.దాన్ని తీసేందుకు టైలర్‌ ప్రయత్నించాడు.కాని ఆయన వల్ల కాలేదు.రోడ్డు మీద వెళ్తున్న వారు పలువురు ఆయనకు సాయంగా వచ్చారు.

కాని పిల్లి పిల్లకు ఇబ్బంది కాకుండా తీయలేక పోతున్నారు.చిన్న రంద్రంలో ఆ పిల్ల ఇరుక్కు పోయింది.

తీసేందుకు ప్రయత్నిస్తుంటే ఆ పిల్లికి గాయం అవుతుంది.దాంతో బెంజ్‌ కారు మెకానిక్‌ను టైలర్‌ పిలిపించాడు.

అక్కడకు వచ్చిన మెకానిక్‌ ఇంజిన్‌ను పగులకొట్టాల్సిందే అంటూ సూచించాడు.

టైలర్‌ అందుకు నో చెప్పకుండా సరే అన్నాడు.

మెల్లగా బెంజ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ కు కారును తీసుకు వెళ్లారు.అక్కడ పిల్లి పిల్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఇంజన్‌కు సంబంధించిన కొంత భాగంను కట్‌ చేశారు.

ఆ తర్వాత పిల్లి పిల్లను మెల్లగా బయటకు తీశారు.చిన్న చిన్న గాయాలు మినహా పిల్లికి ఏం కాలేదు.

పిల్లిని కాపాడిన ఆనందంతో టైలర్‌ మురిసి పోయాడు.ఈ మొత్తం పక్రియకు ఆరు గంటల సమయం పట్టిందట.

ఈ ఆరు గంటల పాటు పిల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెల్‌ ఫోన్‌ టార్చ్‌ను పెట్టడం, దాని గొంతు తడపడం వంటివి చేశారు.మొత్తానికి టైలర్‌ చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.ఈ సంఘటన నవంబర్‌ 30వ తారీకున జరిగింది.లక్షల విలువ చేసే కారును పిల్లి పిల్ల కోసం పగుల కొట్టేందుకు కూడా సిద్దమయిన టైలర్‌ను అభినందించకుండా ఉండలేక పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube