యాపారం మొదలెట్టిన పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప’కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుని తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

 Business Started For Pushpa Movie, Pushpa, Allu Arjun, Sukumar, Rashmika Mandann-TeluguStop.com

కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్అనే ఊరమాస్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే చిత్ర యూనిట్ రివీల్ చేసింది.ఈ లుక్‌కు ప్రేక్షకుల దగ్గర్నుండి విశేష స్పందన రావడంతో ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆశగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను సుకుమార్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అప్పుడే మొదలైనట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పుష్ప చిత్రం కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, అక్కడ బన్నీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ రేటుకు సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

పుష్ప చిత్రంలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలు పలువురు పాన్ ఇండియా స్టార్స్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఆగస్టు 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి బిజినెస్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube