చెప్పులు పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు

ఏదైనా విలువైన వస్తువులు,లేదంటే బంగారం వంటి వస్తువులు పోయినప్పుడు సాధారణంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటాం.కానీ నా చెప్పులు పోయాయి అంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన ఘటన చెన్నై లో చోటుచేసుకుంది.చెన్నై నగరానికి చెందిన ఒక బడా వ్యాపారి రూ.76 వేల విలువ గల తన పది జతల బ్రాండెడ్ షూస్ చోరీ కి గురయ్యాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.చెన్నై నగరంలోని దివాన్ బహదూర్ షన్ముగం వీధికి చెందిన అబ్దుల్ హాఫిజ్ ఓ బడా వ్యాపారి.తన వద్ద ఉన్న పది జతల బ్రాండెడ్ బూట్లను ఎక్కువ డబ్బు వెచ్చించి కొన్నానని, తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే తన బూట్లన్నీ చోరీ అయ్యాయని అబ్దుల్ హాఫిజ్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Business Man Files Police Complaint Of Missing Shoes-TeluguStop.com

తాను నివాసముంటున్న రెండు అంతస్తుల భవనం ప్రవేశద్వారం వద్ద పదిజతల బూట్లు ఉంచితే అవి మిస్ అయ్యాయి అంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు.అయితే వాటిని పక్కఇంట్లో ఉంటున్న యువకులు లేదంటే తన పనివాడు ఈ చోరీ చేసి ఉంటారు అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు.

Telugu Branded Shoes, Complaint Shoes, Bussinessabdul, Channaiah, Compaliant-

అయితే ఎవరైనా విలువైన వస్తువులు పొతే ఫిర్యాదు చేయడం గురించి తెలుసుకానీ ఇలా బూట్ల చోరీ ఫిర్యాదు చేయడం తో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే చివరికి చేసేదేమి లేక దాని నుంచి తేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube