గత ఎనిమిది నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరి కొన్ని దేశాలు ఇంకా కరోనా తీవ్రతతో అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి.
వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే భారత వ్యాపార దిగ్గజం అయిన ఆనంద్ మహీంద్ర తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికరమైన పోస్టును చేయడం జరిగింది.
ఆయన పోస్టు చూసి ఎందరో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆయన చేసిన పోస్టులో మీరు విహారయాత్ర కి ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటూ ఓ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ నెటిజెన్స్ లో ఒక విపరీతమైన ఆసక్తిని నెలకొల్పింది.ఇకపోతే చివరికి ఆ పోస్టులో ఉన్న ట్విస్ట్ చూసి నెటిజెన్స్ అవాక్కవుతున్నారు.ఈ పోస్టులో మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు అని చెబుతూనే.అందుకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ ను కూడా అక్కడ పెట్టాడు.
ఇందులో విహారానికి ప్రసిద్ధి చెందిన మెక్సికో, కెనడా, న్యూజిలాండ్ తో పాటు పలు దేశాల పేర్లు కూడా ఆనంద్ మహీంద్రా పొందుపరిచాడు.అలా పెట్టిన తర్వాత పక్కనే ఓ పజిల్ ఉంచి దానికి సమాధానం ఎంత వస్తే అక్కడికి వెళ్ళండి అంటూ పోస్టులో పేర్కొన్నాడు.
అయితే ఈ పోస్ట్ ను గ్రహించి పరిష్కరించిన వారికి అబ్బురపరిచే సమాధానం వచ్చింది.దాదాపు అందరికీ ఒకే సమాధానం వచ్చేలా పజిల్ ను ఏర్పాటు చేశాడు.అందులో సమాధానంగా తొమ్మిదో సంఖ్యను ఏర్పాటు చేశాడు.అయితే తొమ్మిదో సంఖ్యకు విహార ప్రదర్శనాన్ని చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఆయన పోస్ట్ చేసిన మొత్తం 15 సంఖ్యలలో ఏకంగా 14 దేశాల పేర్లు ఉండగా తొమ్మిదో స్థానంలో మాత్రం ‘ఇంట్లోనే ఉండండి అంటూ’ సూచించే విధంగా ఉంది.దీంతో చివరికి ఆనంద్ మహేంద్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటికి ఎక్కడకి వెళ్ళకూడదని.
ఇంట్లోనే క్షేమంగా ఉండాలని ఆయన సూచించే విధంగా తెలిపాడు.