గ్రామంలోకి సింహం వచ్చిందని భయపడిన స్థానికులు... అసలు నిజం తెలిసి నవ్వులే నవ్వులు...!

ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి.మొదట మోసపోయినా ఆ తరువాత నిజం తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటాం.

 Bushy Dog Mistaken Lion In Spain-TeluguStop.com

జీవితంలో కొన్నిసార్లు జరిగే పొరపాట్లు నవ్వులు కూడా తెప్పిస్తాయి.స్పెయిన్ లో జరిగిన ఒక ఘటనలో గ్రామంలోకి సింహం వచ్చిందని మొదట స్థానికులు భయపడ్డారు.

ఆ తరువాత అది సింహం కాదని కుక్క అని తెలిసి ఆశ్చర్యపోయారు.
పూర్తి వివరాలలోకి వెళితే ఐదు రోజుల క్రితం స్పెయిన్ లోని ఒక గ్రామంలో అచ్చం సింహంలానే ఉన్న ఒక కుక్క రోడ్లపై తిరిగింది.

కుక్కకు బొచ్చు కత్తిరించటం వల్ల ఆ కుక్క స్థానికులకు చూడటానికి సింహంలా కనిపించింది.సింహం వచ్చిందని తెలియడంతో గ్రామంలో కొంత సమయం పాటు ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కంగారు పడుతూ భయంతో గజగజా వణికిపొయారు.

సింహం గురించి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Telugu Bushy Dog Spain-Telugu NRI

విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని సింహాన్ని బంధించారు.ఆ తర్వాత దానిని పరిశీలించగా అది సింహం కాదని గ్రామ సింహం అని తెలియడంతో షాక్ అవ్వడం అధికారుల వంతయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహంలా కనిపించే కుక్కకు సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గ్రామస్థులు కుక్కను చూసి సింహం అనుకొని భయపడటంపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube