కుక్కని దత్తత తీసుకోండి… మూడు నెలలు బీరు ఫ్రీగా పొందండి  

Busch Offers Beer For Fostering Dogs - Telugu America,, Corona Virus, Covid-19

కరోనా వైరస్ కి ప్రపంచం అంతా వణికిపోతుంది.అగ్రరాజ్యం చైనా అయితే కరోనా పోజిటివ్ కేసులలో అన్నిదేశాలని దాటిపోయి టాప్ లో ఉంది.

 Busch Offers Free Beer For Fostering Dogs

అక్కడ కరోనా పోజిటివ్ కేసులు లక్ష దాటిపోయినట్లు తెలుస్తుంది.అయితే మరణాల సంఖ్య అక్కడ తక్కువగా ఉన్నా కూడా కరోనా మాత్రం వేగంగా విస్తరిస్తుంది.

దీంతో అమెరికాలో కూడా చాలా ప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించేశారు.దీంతో యానిమల్ షెల్టర్స్ నడిపే సంస్థలు కూడా మనుషులని రానివ్వడం లేదు.

కుక్కని దత్తత తీసుకోండి… మూడు నెలలు బీరు ఫ్రీగా పొందండి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే న్యూయార్క్‌లోని మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ తమ షెల్టర్‌లో ఉన్న కుక్కలను దత్తత ఇచ్చేందుకు సిద్ధమైంది.మనుషుల సందర్శన ఆగిపోవడంతో కుక్కలను మనుషుల వద్దకు చేర్చాలని సంస్థ నిర్ణయించింది.

కరోనా కారణంగా కుక్కలను దత్తత తీసుకోవడానికి ప్రజలు ఎలా ముందుకి వస్తారో అర్ధం కాని పరిస్థితిలో బుష్ బీర్ కంపెనీతో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ కలిసి వినూత్న ప్రయత్నం మొదలెట్టింది.ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలలకు బీర్‌ను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా అందిస్తుంది అని ప్రకటించారు.

కుక్కను దత్తత తీసుకున్న వారు.ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.

మొదటగా పంపించే వారికి 100 డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది.ఈ కొత్త ఐడియాని ప్రకటించిన తర్వాత మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ముందు మనుషులు క్యూ కట్టారు.

కుక్కలని దత్త తీసుకోవడం ద్వారా మూడు నెలలు తాగినంత బీర్ పొందవచ్చని భావించి ముందుకొస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Busch Offers Free Beer For Fostering Dogs Related Telugu News,Photos/Pics,Images..