కేసీఆర్ పై రాములమ్మ బాణం ? ఆ యాత్ర తో శ్రీకారం ?

గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది.ముఖ్యంగా అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు , కేసీఆర్ ను అన్ని విషయాల్లోనూ ఇరుకున పెట్టే  విధంగా చేయడం ద్వారా, ఆ పార్టీని బలహీనం చేసి అధికారంలోకి రావాలనే ఎత్తుగడకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

 Bus Tour Planed On Telangana Bjp Leaders , Telangana Bjp Leaders , Vijayashanthi-TeluguStop.com

ఇప్పటికే వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా కెసిఆర్ ను ఇరుకున పెట్టి ప్రజల్లో చర్చ జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ఏ చిన్న అవకాశం దొరికినా, వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారు.ఇటీవల పార్టీలో చేరిన విజయశాంతి సైతం కెసిఆర్ పై ఏ అవకాశం దొరికినా వదిలి పెట్టకుండా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి విజయశాంతి కెసిఆర్ పై విరుచుకు పడుతూనే వస్తున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ బలం పెంచేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపించి, ప్రజల్లో ఆదరణ తగ్గించేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు.33 జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర కొనసాగించే విధంగా ప్లాన్ చేశారు.అయితే ఈ బస్సు యాత్ర కార్యక్రమం మొత్తం విజయశాంతి ఆధ్వర్యంలో జరిగే విధంగా బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.విజయశాంతి ఈ యాత్రలో పాల్గొంటే మరింత సక్సెస్ అవుతుందని బీజేపీ అగ్రనాయకులు నమ్ముతున్నారట.


Telugu Bandi Sanjay, Bus, Dubbaka, Ghmc, Modhi, Ramulamma, Telangana, Telangana

టిఆర్ఎస్ ప్రభుత్వం లోపాలను, కేసీఆర్ కు సంబంధించిన విషయాలలో ముక్కుసూటిగా విమర్శలు చేసేందుకు విజయశాంతి అస్త్రాన్ని బీజేపీ బయటకు తీసినట్లుగా కనిపిస్తోంది.నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో, దాని కంటే ముందుగానే బస్సు యాత్ర చేపట్టి తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.రాములమ్మ మాటల తూటాలను కేసీఆర్ ఏ విధంగా తట్టుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube