బస్సునే షెల్టర్ గా మార్చితే..!

ప్రయాణీకుల ఇబ్బందులు చూడలేక కొత్తగూడెం బస్ డిపో మేనేజర్ ప్రయాణీకుల కోసం ఓ రన్నింగ్ బస్సునే షెల్టర్ గా మార్చారు.కొత్తగూడెం, పాల్వంచ మధ్యలో నిత్య రద్దీగా ఉండే ఇల్లెందు అడ్డరోడ్డులో రోడ్డు పనుల నిమిత్తం అక్కడ బస్ షెల్టర్ ను కూల్చివేశారు.

 Bus Shelter For Passangers At Kothagudem Yellandu X Road-TeluguStop.com

అయితే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు ఈ టైం లో అక్కడ వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు ఎండలకు బాగా ఇబ్బంది పడుతున్నారు.అయితే డిపో మేనేజర్ దృష్టిలో ఇది వెళ్లగా ఓ బస్సునే షెల్టర్ గా చేసి వెయిటింగ్ చేసే ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు.

ఆ బస్సునే షెల్టర్ గా చేసుకుని వారు ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు దిగి ఆ బస్సు ఎక్కేస్తున్నారు. షెల్టర్ అంటే కేవలం కూర్చోవడమే అని కాకుండా త్రాగు నీరుని సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది.

 Bus Shelter For Passangers At Kothagudem Yellandu X Road-బస్సునే షెల్టర్ గా మార్చితే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సౌకర్యానికి ప్రయాణీకులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇల్లందు నుండి పాల్వంచ, భధ్రాచలం, మణుగూరు వెళ్లాల్సిన వారు.

ఇతర ఊర్ల నుండి ఇల్లెందు వెళ్లాల్సిన వారు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది.వారు వెళ్లాల్సిన బస్సు వచ్చే దాకా షెల్టర్ లో వెయిట్ చేయాలి కాని రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంగా అక్కడ షెల్టర్ ను కూల్చేశారు.

డిపో మేనేజర్ చలువతో అక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు.

.

#Yellandu X Road #Passangers #Bus Shelter #Kothagudem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు