ఇదేందయ్యా ఇది: గాలికి కొట్టుకుపోయిన బస్సు ...

మామూలుగా పెనుగాలులకు పెద్ద పెద్ద చెట్లు సైతం విరిగిపడి వర్షాలకు కొట్టుకుపోతున్న సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం.అంతేగాక ఈ పెనుగాలుల కారణంగా ఒక్కోసారి ఏకంగా ఊర్లోని ఇల్లులు సైతం పెకల్చివేస్తుంటాయి.

 Bus Was Moving Without Driver For 200 Meters In Telangana Bus Moving, Telangana,-TeluguStop.com

అయితే తాజాగా వీచినటువంటి  పెనుగాలులకు రోడ్డు ప్రక్కన నిలిపినటువంటి బస్సు సైతం జారిపోయి పక్కనే ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన సత్తుపల్లి పరిసర ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు నిలిపి ఉంది.

అయితే ఆ సమయంలో పెద్దగా వీచినటువంటి పెనుగాలులకు ఈ బస్సు కదిలి ఏకంగా 200 మీటర్లు డ్రైవర్ లేకుండా ప్రయాణించింది.చివరికి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది.

కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ హాని జరగలేదు.

అయితే ఈ విషయం గురించి స్పందించినటువంటి స్థానికులు బస్సు నిలిపే సమయంలో డ్రైవర్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం బస్సు ప్రమాదానికి గురవుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube