జోరుగా వ‌ర్షం పడుతోంది. బ‌స్సు డ్రైవ‌ర్ మ‌మ్మ‌ల్ని అందులోనే వ‌దిలేసి బ‌య‌టే అలా వేచి చూస్తుంటే..!  

Bus Driver Helping Nature Real Story -

ఆ రోజు కాయంకులం నుంచి బెంగుళూరుకు కేఎస్ఆర్‌టీసీకి చెందిన బ‌స్సులో వెళ్తున్నాం.నేను, నా భార్య ఇద్ద‌రం ప్ర‌యాణం చేస్తున్నాం.

Bus Driver Helping Nature Real Story

రాత్రి భోజ‌నాల వేళ‌యింది.ఇంత‌లో డ్రైవ‌ర్ ఓ రెస్టారెంట్ ద‌గ్గ‌ర ఆపాడు.

అంద‌రూ తృప్తిగా భోజ‌నం చేశారు.ఇంత‌లో స‌డెన్‌గా వ‌ర్షం స్టార్ట్ అయింది.

జోరుగా వ‌ర్షం పడుతోంది. బ‌స్సు డ్రైవ‌ర్ మ‌మ్మ‌ల్ని అందులోనే వ‌దిలేసి బ‌య‌టే అలా వేచి చూస్తుంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అది అంత‌కంత‌కూ పెరుగుతుంది త‌ప్ప త‌గ్గ‌లేదు.వ‌ర్షం జోరు పెరిగే లోపే దాదాపుగా ప్ర‌యాణికులు అంద‌రూ బ‌స్సులోకి చేరారు.

డ్రైవ‌ర్ కోసం వెయిట్ చేస్తున్నారు.అయితే అత‌ను వ‌చ్చాడు.

కానీ వెంట‌నే హ‌డావిడిగా మ‌ళ్లీ బ‌స్సు దిగేశాడు.

డ్రైవ‌ర్ అలా బ‌స్సు దిగే స‌రికి మాకే కాదు, బ‌స్సులో ఉన్న అంద‌రికీ కోపం వ‌చ్చింది.అంద‌రూ బ‌స్సులో ఉండ‌గా మ‌ళ్లీ దేని కోసం అతను దిగాడు అనుకున్నాం.అలా బ‌స్సు దిగిన డ్రైవ‌ర్ మేం భోజ‌నం చేసిన రెస్టారెంట్ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ వేచి ఉన్నాడు.

స‌మ‌యం గ‌డుస్తోంది.అయినా అత‌ను అక్క‌డి నుంచి క‌ద‌ల‌డం లేదు.

దీంతో అంద‌రికీ ఒకింత కోసం కూడా వ‌స్తోంది.వ‌ర్షం ఓ వైపు దంచి కొడుతుంటే వెంట‌నే బ‌స్సు తీయ‌క ఇంకా అలా ఎందుకు ఎవ‌రి కోసం చూస్తున్నాడో మాకు అర్థం కాలేదు.

అలా 10-15 నిమిషాలు గ‌డిచిన‌ట్టుంది.ఇంత‌లో త‌న చేతిలో ఉన్న గొడుగును బ‌యటికి తీసి తెరిచాడు ఆ డ్రైవ‌ర్‌.రెస్టారెంట్ నుంచి అప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్న ఓ మ‌హిళ, ఆమె చిన్నారి పాప‌ను అత‌ను జాగ్ర‌త్త‌గా గొడుగు కింద‌కు చేర్చాడు.వారిపై వ‌ర్షం ప‌డ‌కుండా బ‌స్సు ద‌గ్గ‌రికి చేర్చి అందులో ఎక్కించాడు.

వెంట‌నే బ‌స్సు స్టార్ట్ చేశాడు.అప్పుడు అనుకున్నాం… మేం పొర‌పాటు ప‌డ్డామ‌ని.

ఆ త‌రువాత మరుస‌టి రోజు ఉద‌యం బ‌స్సు గ‌మ్య‌స్థానంలో ఆగింది.ఆ డ్రైవ‌ర్ ప్ర‌యాణికులంద‌రి ల‌గేజ్ తీసి ఇస్తూ ఏ మాత్రం విసుగు చెంద‌కుండా చిరున‌వ్వుతో అంద‌రికీ స‌మాధానం చెబుతూ ప‌ని చేసుకుపోతున్నాడు.

అత‌న్ని చూసి మాకు ఆశ్చ‌ర్యం వేసింది.రాత్రంతా దాదాపుగా నిద్ర లేకుండా డ్రైవ్ చేశాడు.

రెస్టారెంట్ ద‌గ్గ‌ర అలా స‌హాయం చేశాడు.తెల్లారి ఇప్పుడిలా చాలా కూల్‌గా అంద‌రికీ హెల్ప్ చేస్తున్నాడు.

నిజంగా అత‌ను చాలా మంచి డ్రైవ‌రే అన్న అభిప్రాయానికి వ‌చ్చాం.అభిప్రాయ‌మేంటి… నిజంగా అత‌ను చాలా మంచి కూల్ డ్రైవ‌రే.

మ‌మ్మ‌ల్ని సేఫ్ గా తీసుకువచ్చి అంద‌రి ప‌ట్ల జాగ్ర‌త్త చూపుతూ హెల్ప్ చేస్తున్నాడు క‌దా.అందుకని అత‌నికి థ్యాంక్స్‌.! ఇంత‌కీ అత‌ని పేరు చెప్ప‌లేదు క‌దా.! అత‌ని పేరు సురేష్‌.

క‌ర్ణాట‌క ఆర్‌టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌.అలాంటి డ్రైవ‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు.
!

— సునీల్ శ్యామ్ అనే వ్య‌క్తికి ఇటీవ‌ల జ‌రిగిన రియ‌ల్ సంఘ‌ట‌న ఇది.రియ‌ల్ స్టోరీ.!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bus Driver Helping Nature Real Story- Related....