స్టీరింగ్ తిప్పుతూ డ్రైవర్ టిక్ టాక్ వీడియోవైరల్  

Bus Driver Doing Tik Tok Video While Driving -

టిక్ టాక్ మోజులో పడి ఎందరో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం.కానీ ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు.

Bus Driver Doing Tik Tok Video While Driving

ఈ టిక్ టాక్ ల మోజులో పడి ఏమి చేస్తున్నాం అన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.ఆ మధ్య టిక్ టాక్ వీడియోలు వద్దని భర్త చెప్పడం తో భార్య టిక్ టాక్ వీడియో చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

అలానే టిక్ టాక్ వీడియో చేస్తూ గన్ ఫైర్ అవ్వడం తో ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఇలా నిత్యం ఎదో ఒకటి చోటుచేసుకుంటున్న కూడా జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు.టిక్ టాక్ గేమ్ పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది.

వెర్రి వేషాలు వేస్తూ వాటిని వీడియోలుగా తీసి షేర్ చేస్తూ లైకులు, కామెంట్ల కోసం ఎగబడుతున్నారు.ఇందుకోసం వారు చేస్తున్న ఫీట్లు కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి.

మరికొందరి ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు కూడా.ఒక చేతితో స్టీరింగ్ తిప్పుతూ మరో చేతిలో మొబైల్ ఫోన్ తీసుకొని షూట్ చేయడం ప్రారంభించాడు.

బస్సును నడుపుతున్నానన్న విషయాన్ని మరిచి నిర్లక్ష్యంగా డ్రైవర్ వ్యవహరించాడని అతనిపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.బస్సులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాల్ని పణంగా పెట్టాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు అతడ్నిసస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bus Driver Doing Tik Tok Video While Driving- Related....