టునీషియాలో ఘోర ప్రమాదం  

Bus Crash In Northern Tunishiya - Telugu 20 Members Serious Injuried And Take Him To The Hospital, 24 Members Dead In Tunishiya Bus Accident, Bus

ఒకరు కాదు.ఇద్దరూ కాదు ఒకేసారి 24 మంది ప్రాణాలు వదిలారు.

Bus Crash In Northern Tunishiya

ఇంతటి విషాద ఘటన టునీషియాలో జరిగింది.ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది.

టునీష్ రాజధాని నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్‌కు వెళ్తుండగా ఎయిన్ స్నోస్సీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే చనిపోయారు.

మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనలో బస్సుపైగా పూర్తిగా పైకి లేచిపోవడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని దగ్గర ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ఉన్నట్టు తెలుస్తోంది.బాధితులందరూ 20, 30 మధ్య వయస్కులేనని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు