తూర్పు గోదావరిలో బస్సు యాక్సిడెంట్‌, 10 మంది మృతి  

Bus Accident In East Godavari-bus,bus Accident,chinthurlu,maredumili,ten People Dead

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాక్సిడెంట్‌ జరిగింది.లోయలో బస్సు పడటంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాధమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.మరి కొందరు ప్రస్తుతం తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో కొట్టుమిట్టాడుతున్నారు.తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మరియు చింతూరుల మద్య నడుస్తున్న ఈ బస్సు మద్యలో లోయలో పడింది.విషయం తెలుసుకున్న మారేడుమిల్లి పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యల అందిస్తున్నారు.

Bus Accident In East Godavari-bus,bus Accident,chinthurlu,maredumili,ten People Dead-Bus Accident In East Godavari-Bus Bus Chinthurlu Maredumili Ten People Dead

పలువురు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.బస్సు మారేడుమిల్లి నుండి బయలుజేరి చింతూరు వెళ్తుంది.మారేడుమిల్లి నుండి బయలుజేరిన కాసేపటికే బస్సు లోయలో పడింది.ఆ సమయంలో బస్సులో డ్రైవర్‌, కండెక్టర్‌తో కలిపి 20 మంది ఉన్నట్లుగా ప్రాధమిక విచారణలో వెళ్లడయ్యింది.లోయ ప్రాంతం టూరిస్ట్‌ స్పాట్‌ కావడం వల్ల అక్కడ జనాలు ఎక్కువ ఉండటంతో డ్రైవర్‌ బస్సును కంట్రోల్‌ చేయడంలో విఫలం అయ్యాడని, దాంతో బస్సు లోయలోకి దూసుకు పోయిందని తెలుస్తోంది.

Bus Accident In East Godavari-bus,bus Accident,chinthurlu,maredumili,ten People Dead-Bus Accident In East Godavari-Bus Bus Chinthurlu Maredumili Ten People Dead

దాదాపుగా 30 అడుగుల లోయలోకి బస్సు దూసుకు పోవడంతో ప్రాణ నష్టం ఎక్కువ అయ్యింది.ఈ బస్సు యాక్సిడెంట్‌పై ప్రభుత్వం మరికాసేపట్లో ఒక అధికారిక ప్రకటన చేయబోతుంది.