బురుండీ దేశాధ్యక్షుడు మృతి, కారణం కరోనా!!

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరు మృతి చెందినా ఆ మృతి వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా అన్న ఆలోచన ప్రతిఒక్కరిలో పెరిగిపోతుంది.వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మృతి చెందినప్పటికీ కూడా కరోనా వల్లే మృతి చెంది ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 Burundi President Dies Of Illness Suspected To Be Coronavirus, Burundi, Coronavi-TeluguStop.com

తాజాగా ఆఫ్రికాఖండ దేశం బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా ఆకస్మిక గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఇటీవలే అనారోగ్యం బారిన పడ్డ ఆయన కోలుకోగా ఇప్పుడు ఉన్నట్టుండి చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆకస్మిక గుండెపోటుతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం చెబుతున్నా కరోనాతోనే చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడం తో ఈ అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.55 ఏళ్ల కురుంజిజా శనివారం ఆస్పత్రిలో చేరి, సోమవారానికల్లా కోలుకున్నాడు.

మంగళవారం అనూహ్యంగా గుండెపోటు వచ్చిందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికించలేకపోయామని వైద్యులు చెబుతున్నారు.

కురుంజిజా భార్య డెనిస్‌కు ప్రస్తుతం కెన్యాలోని అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.బురుండీలో ఇప్పటివరకు 83 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే చనిపోయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube