ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.రాబోయే మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది.
దీంతో పాటు వడగాల్పులు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలుస్తోంది.
అటు ఉత్తర భారత్ నుంచి దక్షిణాది వైపు వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ఈ మేరకు ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని సూచించింది.