వారి ఫుడ్ ఆర్డర్ చేసుకోండంటున్న బర్గర్ కింగ్!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.మనుషుల మధ్య దూరం విపరీతంగా పెరిగిపోయినప్పటికీ మానవత్వం మాత్రం చాలా దగ్గర అయింది.

 Burger King Urges Peoples Are Order Mc Donalds And Kfc Burger King, Urges Peopl-TeluguStop.com

కరోనా కేసులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.అయితే లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది.

కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు.ప్రస్తుతం లాక్ డాన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు సంస్థలు తీవ్ర కృషి చేస్తున్నాయి.

ఇదివరకు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న కొన్ని ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థలు ఈ సంక్షోభంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నాయి.శత్రుదేశాలు సైతం చేతులు కలిపి మిత్రులుగా మారుతున్నాయని చెప్పడానికి తాజా సంఘటనే నిదర్శనం.

కరోనా నేపథ్యంలో ప్రముఖ వ్యాపార సంస్థలో పనిచేసే వేలమందికి ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడకుండా వారిని ఆదుకోవాలని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్ కింగ్ చేసిన ట్వీట్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది.

అమెరికన్ బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ సంస్థ అయిన బర్గర్ కింగ్ యూకేలోని మెక్ డోనాల్డ్, కేఎఫ్‌సీ, పాపా జాన్స్‌, టాకో బెల్స్‌ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవాలని బర్గర్ కింగ్ పేర్కొన్నారు.

మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని ఎప్పుడూ కూడా ఊహించలేదని, కానీ ఈ సంస్థను నమ్ముకున్న కొన్ని వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతారనే ఉద్దేశంతో వారికి మీ మద్దతు ఎంతో అవసరమని ఈ సందర్భంగా బర్గర్ కింగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.మెక్ డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఉద్యోగుల జీవితాలను ఆదుకోండని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బర్గర్ కింగ్ చేసిన ఈ ట్వీట్ కు మెక్ డొనాల్డ్స్ అభిమానుల నుంచి భారీ మద్దతు, గౌరవం లభించింది.ప్రస్తుతం బర్గర్ కింగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ప్రముఖ ఫుడ్ సంస్థ బర్గర్ కింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube