అమెరికాలో సమ్మెలపై 'బీఎల్‌ఎస్‌' నివేదిక..!!!  

అమెరికాలో గడిచిన ఏడాది లో వివిధ సమ్మెలలో పాల్గొన్న వారి సంఖ్య గడిచిన 32 ఏళ్లలో ఎప్పుడూ లేదని , భారీ స్థాయిలో ఉద్యోగులు ఇలా సమ్మెలో పాల్గొనడం ఇదే ప్రధమమని కార్మిక గణాంకాల బ్యూరో (బీఎల్‌ఎస్‌) ఒక నివేదిక విడుదల చేసింది..తమ యూనియన్ల పై తిరుగుబాటు చేసిన ప్రభుత్వ పాటశాలల టీచర్లు మొట్ట మొదటిగా ఈ సమ్మె పోరాటానికి నాయకత్వం వహించారు.

వర్జీనియా, ఒక్లహం ,అరోజొనా రాష్ట్రాలలో అధికంగా సమ్మెలు జరిగాయి. ప్రధానంగా 20 కార్మిక వివాదాలను బిఎల్‌ఎస్‌ నివేదిక గుర్తించింది..ఈ వివాదాలనే సమ్మెలు లేదా లాకవుట్ లుగా పేర్కొన్నారు. 2007 లో కార్మికులతో 21 వివాదాలు జారీచేయగా ,2018లో మాత్రం 20 చోటు చేసుకున్నాయి. మొత్తంగా దాదాపు 4,85,000 మంది కార్మికులు విధులని బహిష్కరించారు.

Bureau Of Labor Statistics Us Stikre Report-

Bureau Of Labor Statistics Us Stikre Report

మొత్తంగా చూస్తే రిజోనాలో 86వేలు, ఓక్లహామాలో 45వేలు, పశ్చిమ వర్జీనియాలో 35 వేలు, కెంటకీలో 26వేలు మంది సమ్మెలో పాల్గొన్నారు. అయితే రికార్డ్ స్థాయిలో గడిచిన కాలంలో ఇంతమంది భారీ స్థాయిలో సమ్మెలో పాల్గొనడం ఇదే ప్రధమం అంటున్నారు.