తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇక ఈ సినిమాలో నటించిన అనంతరం అల్లు అర్జున్ కు నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అభిమానులు పెరిగిపోయారు.ఇక పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
పుష్ప సినిమాలో నటించిన అందుకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను మాత్రమే కాకుండా సైమా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.అదేవిధంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నారు ఇలాంటి అవార్డును అందుకున్న తొలి దక్షిణాది సినీ హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇప్పటికే ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న బన్నీ తాజాగా మరొక అవార్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా అల్లుఅర్జున్ను ప్రతిష్టాత్మక GQ MOTY-2022 ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు.ఇలా అల్లు అర్జున్ అరుదైన అవార్డును అందుకోవడంతో బన్నీ ఫాన్స్ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలాగే తమ అభిమాన హీరో మరిన్ని అవార్డులను సొంతం చేసుకుని మరిన్ని అద్భుతమైన సినిమాలలో నటించాలంటూ ఆకాంక్షించారు.