నందమూరి హీరో మూవీని మెచ్చుకుంటూ బన్నీ ట్వీట్.. మెగా ఫ్యాన్స్ కు మండేలా?

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.రికార్డు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండగా ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

 Bunny Tweet About Kalyan Ram Goes Viral In Social Media Details, Bunny, Kalyan R-TeluguStop.com

మరోవైపు సినీ ప్రముఖులు సైతం బింబిసార మూవీని ప్రశంసిస్తున్నారు.తాజాగా బన్నీ ఈ సినిమా గురించి పాజిటివ్ గా పోస్ట్ చేశారు.

ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ఫాంటసీ మూవీ బింబిసార అని బన్నీ అన్నారు.బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ నటన ప్రభావితం చేసే విధంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చారు.తొలి ప్రయత్నంలో బింబిసార మూవీని అద్భుతంగా తెరకెక్కించిన వశిష్టకు, ఇతర సభ్యులకు, సాంకేతిక బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని బన్నీ కామెంట్లు చేశారు.విభిన్నమైన సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తున్న కళ్యాణ్ రామ్ అంటే ఎప్పటికీ గౌరవమే అని ఆయన పేర్కొన్నారు.

అయితే బన్నీ చేసిన ట్వీట్ ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీస్తోంది.

Telugu Allu Arju, Alluarjun, Bimbisara, Bunny, Kalyan Ram, Fans, Nandamuri Fans,

బింబిసార సినిమా రిలీజైన తర్వాత మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అనే ట్వీట్ వైరల్ అవుతుండటం ఇప్పటికే మెగా హీరోలకు తీవ్రస్థాయిలో ఆగ్రహం కలిగిస్తోంది.మెగా ఫ్యాన్స్ కు కోపం రావాలనే ఆలోచనతోనే బింబిసార గురించి పాజిటివ్ గా బన్నీ పోస్ట్ పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ రాంగ్ టైమ్ లో ట్వీట్లు చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Allu Arju, Alluarjun, Bimbisara, Bunny, Kalyan Ram, Fans, Nandamuri Fans,

బన్నీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు మెగా ఫ్యాన్స్ కు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ ట్వీట్ల వల్ల బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube