బన్నీ పెళ్లి పెటాకులు చేస్తానంటున్న డైరెక్టర్  

Bunny Sukumar Movie To Have An Interesting Take Off-allu Arjun,bunny,rashmika Mandanna,sukumar,tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లి పెటాకులు చేస్తానంటున్నాడు ఓ స్టార్ డైరెక్టర్.అయితే ఇదంతా నిజజీవితంలో కాదులెండీ.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ తన నెక్ట్స్ మూవీని తెకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Bunny Sukumar Movie To Have An Interesting Take Off-allu Arjun,bunny,rashmika Mandanna,sukumar,tollywood News Telugu Tollywood Movie Cinema Film Latest News-Bunny Sukumar Movie To Have An Interesting Take Off-Allu Arjun Bunny Rashmika Mandanna Sukumar Tollywood News

ఈ సినిమాకు మిగతా సినిమాలలాగా కాకుండా ఓ వినూత్న స్టార్టింగ్ పాయింట్‌తో తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా నటించనున్నాడు.అయితే సినిమా స్టార్టింగ్‌లోనే బన్నీ-రష్మికల పెళ్లి జరుగుతుందని, ఆ తరువాత వారు కొన్ని కారణాల వల్ల విడిపోయి మళ్లీ ఎలా ఒకటయ్యారనే అంశాన్ని సినిమాలో చూపించనున్నాడు సుకుమార్.ఇంతవరకు సుకుమార్ ఇలాంటి కాన్సెప్ట్‌ను తెరకెక్కించలేదని, ఈ కాన్సెప్టుతో బన్నీ మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని సినిమా వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి బన్నీ పెళ్లిని పెటాకులు చేసేందుకు సుకుమార్ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.అటు బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.