యూట్యూబ్ లో సరైనోడు అరుదైన రికార్డు… ఫస్ట్ ఇండియన్ మూవీ  

Bunny Sarainodu Movie Create New Record in india Cinema, Tollywood, Telugu Cinema, South Cinema, Social Media, Allu Arjun - Telugu Allu Arjun, Bunny Sarainodu Movie Create New Record In India Cinema, Social Media, South Cinema, Telugu Cinema, Tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు భిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు.కమర్షియల్ ఫార్ములాలోనే సినిమాలు చేసిన ఒక సినిమా కథతో మరో సినిమా కథకి ఏ మాత్రం సంబంధం లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు.

 Bunny Sarainodu Movie Create New Record In India Cinema

అందుకే బన్నీ సినిమా ఎంపిక చాలా ఆలస్యంగా ఉంటుంది.దర్శకులకి రెండు, మూడు సార్లు కథ విషయంలో కరెక్షన్ చెబుతూ ఉంటాడనే టాక్ ఉంది.

ప్రతి సినిమాకి కొత్తదనం చూపిస్తూ ఉండటం వలన అల్లు అర్జున్ ఏవరేజ్ సినిమాలు కూడా తరువాత చూడదగ్గ విధంగా ఉంటాయి.ఇక బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే వాటికి మంచి డిమాండ్ ఉంటుంది.

యూట్యూబ్ లో సరైనోడు అరుదైన రికార్డు… ఫస్ట్ ఇండియన్ మూవీ-Movie-Telugu Tollywood Photo Image

ఇక బన్నీ సినిమాలకి మలయాళం, హిందీ భాషలలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపద్యంలో అతని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి.

తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి.ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి వదులుతారు.

వాటిని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు.ఇలా రిలీజ్ చేసిన వీడియోలు రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ ఉంటాయి.

ఇక అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో యుట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

బన్నీ సినిమాకి దరిదాపులలో హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

.

#Social Media #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bunny Sarainodu Movie Create New Record In India Cinema Related Telugu News,Photos/Pics,Images..