అలియా భట్ తో అల్లు అర్జున్ రొమాన్స్! డ్యూయల్ రోల్ లో మొదటి సారి  

అలియా భట్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్న బన్నీ. .

Bunny Romance With Alia Bhatt-bunny,dil Raju,tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంటవెంటనే వేణు శ్రీరామ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. మూడు సినిమాలని వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ చేయాలని ప్లాన్ తో ఉన్న అల్లు అర్జున్ దానికి పూర్తిగా కసరత్తు చేస్తున్నాడు..

అలియా భట్ తో అల్లు అర్జున్ రొమాన్స్! డ్యూయల్ రోల్ లో మొదటి సారి-Bunny Romance With Alia Bhatt

ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేయడంతో పాటు, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా సింగిల్ సిట్టింగ్ లో బన్నీ ఒకే చేయడంతో పాటు అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోమని దిల్ రాజుకి చెప్పినట్లు సమాచారం.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.