బన్నీ కోసం కన్నడ విలన్ ని తీసుకొస్తున్న సుకుమార్  

Bunny Fight With Two Villons For Sukumar Movie - Telugu Allu Arjun, Director Sukumar, Jagapathibabu, Telugu Cinema, Tollywood

రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ మరో సారి బన్నీతో సినిమా చేస్తున్నాడు.వీరిద్దరి కలయికలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

 Bunny Fight With Two Villons For Sukumar Movie

అందుకు తగ్గట్లే సుకుమార్ ఒకప్పటిలా క్లాస్ కథతో కాకుండా పక్కా మాస్ కమర్షియల్ కథాంశంతోనే బన్నీని ఈ సారి ప్రెజెంట్ చేయబోతున్నాడు.ఇక నల్లమల ఫారెస్ట్ నేపధ్యంలో నడిచే ఈ కథలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకున్న ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.

బన్నీ కోసం కన్నడ విలన్ ని తీసుకొస్తున్న సుకుమార్-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు.

ఇప్పటికే ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో పరిచయం చేస్తూ ఉండగా.ఇప్పుడు మరో సారి తన లక్కీ విలన్ అయిన జగపతిబాబుని విలనీగా ప్రెజెంట్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మరో విలన్ ని కూడా సుకుమార్ రంగంలోకి దిమ్పుతున్నాడు.కన్నడ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా విలన్ గా రాణిస్తున్న రాజ్ దీపక్ శెట్టి కూడా విలన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఇక హీరోయిన్ గా రష్మిక మందన్న ఇప్పటికే ఓకే అయ్యింది.పల్లెటూరు అమ్మాయి పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది.మొత్తానికి ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా ఇద్దరు బలమైన విలన్స్ ని బన్నీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bunny Fight With Two Villons For Sukumar Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test