బన్నీ త్రివిక్రమ్ మూవీకి బద్రీనాథ్ సినిమా లింక్  

బన్నీ మూవీ కోసం అలకనంద టైటిల్ పరిశీలిస్తున్న త్రివిక్రమ్..

Bunny And Trivikram Movie Title Alakananda-geetha Arts Production,telugu Cinema,tollywood

అల్లు అర్జున్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో మైథాలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన చిత్రం బద్రీనాథ్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత దారుణమైన డిజాస్టర్ గా మారిపోయింది, అల్లు అర్జున్ కెరియర్ లోనే ఆ సినిమా పెద్ద డిజాస్టర్. ఆ సినిమాలో హీరోయిన్ తమన్నా పేరు అలకనంద అనే విషయం అందరికి తెలిసిందే..

బన్నీ త్రివిక్రమ్ మూవీకి బద్రీనాథ్ సినిమా లింక్-Bunny And Trivikram Movie Title Alakananda

అయితే ఇప్పుడు ఆ పేరుకి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాకి లింక్ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా కొత్త సినిమా రీసెంట్ గా లాంచ్ అయ్యింది. ముందుగా ఈ సినిమాకి నాన్న నేను అనే పేరు పెట్టాలని అనుకున్న ఎందుకనో ఇంకా టైటిల్ విషయంలో దర్శకుడు క్లారిటీ రాలేదని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం హీరోయిన్ పేరు బేస్ చేసుకొని అలకనంద అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక త్రివిక్రమ్ కెరియర్ లో అ తో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ అలకనంద టైటిల్ ని పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడని తెలుస్తుంది.